OTT Telugu: తెలుగు డిజిటల్ వినోద రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' తాజాగా తీసుకొచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నా వైఫ్ మిస్సింగ్. ఈ సినిమా వచ్చిన తొలి రోజు నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా తాజాగా మరో మైలురాయిని అందుకుంది.

తాజాగా ఈ ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ఏకంగా 100 మిలియన్లకు పైగా (100M+ Streaming Minutes) స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో జయకేతనం ఎగురవేసింది.
ఒక హిస్టారికల్ లవ్ స్టోరీ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా.. కథేంటంటే?
'ఒక హిస్టరీ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ నుంచి.. హెడ్‌లైన్స్‌లో నిలిచే సస్పెన్స్ థ్రిల్లర్ వరకు' అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో నా వైఫ్ మిస్సింగ్ మూవీ రికార్డును ఆహా ఓటీటీ షేర్ చేసింది. 2008లో వచ్చిన కొత్త బంగారం లోకంతో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఈ థ్రిల్లర్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంటున్నారు.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. చాలా ప్రశాంతంగా, అందమైన ప్రేమకథతో ప్రారంభమయ్యే ఈ చిత్రం.. ఊహించని విధంగా హీరో భార్య అదృశ్యం కావడంతో ఒక్కసారిగా హై-వోల్టేజ్ మిస్టరీ డ్రామాగా రూపాంతరం చెందుతుంది.
అసలు ఆ భార్య ఏమైంది? ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా ఈ మిస్సింగ్ వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా? అనే ప్రశ్నల చుట్టూ కథనం వేగంగా పరుగులు తీస్తుంది. పోలీసుల విచారణ, అనుమానితుల జాబితా పెరుగుతుండటం, ప్రతీ సన్నివేశంలో ఎదురయ్యే ఊహించని మలుపులు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని అందిస్తాయి.
తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్ బ్రహ్మరథం
ఈ ‘ఆహా’ ఆరిజినల్ మూవీ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న థ్రిల్లర్ లవర్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
{{/usCountry}}ఈ ‘ఆహా’ ఆరిజినల్ మూవీ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న థ్రిల్లర్ లవర్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
{{/usCountry}}ఇటీవలి కాలంలో ఓటీటీ వీక్షకులు రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్ల కంటే మైండ్ గేమ్‌లు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారనేడానికి ‘నా వైఫ్ మిస్సింగ్’ సాధించిన ఈ 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ మైలురాయే నిదర్శనం. నటీనటుల నేచురల్ పెర్ఫార్మెన్స్, ఉత్కంఠభరితమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఓటీటీ ట్రెండింగ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలబెట్టాయి.
వీకెండ్ లో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే సినిమా ప్రేమికులకు ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న ‘నా వైఫ్ మిస్సింగ్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఈ రికార్డ్ బ్రేకింగ్ థ్రిల్లర్‌ను మిస్ అవ్వకుండా చేర్చేసుకోండి.