ఒకే ఓటీటీలోకి ఒకే రోజు ఓ తెలుగు, మరో తమిళ థ్రిల్లర్ మూవీస్.. సునీల్ నటించిన సినిమా ఇది

ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు థ్రిల్లర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇందులో ఒకటి తెలుగు కాగా.. మరొకటి తమిళం కావడం విశేషం. తెలుగు మూవీలో సునీల్ కూడా నటిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని సన్ నెక్ట్స్ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 3) వెల్లడించింది.

Published on: Dec 3, 2025, 21:07:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ నెలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే అందులో ఒకే ఓటీటీలోకి ఒకే రోజు రెండు థ్రిల్లర్ సినిమాలు రానుండటం విశేషం. ఇవి రెండూ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీటిలో ఒకటి తెలుగు మూవీ దివ్య దృష్టి కాగా.. మరొకటి తమిళ మూవీ అన్ పార్వాయిల్.

ఒకే ఓటీటీలోకి ఒకే రోజు ఓ తెలుగు, మరో తమిళ థ్రిల్లర్ మూవీస్.. సునీల్ నటించిన సినిమా ఇది
ఒకే ఓటీటీలోకి ఒకే రోజు ఓ తెలుగు, మరో తమిళ థ్రిల్లర్ మూవీస్.. సునీల్ నటించిన సినిమా ఇది

సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రెండు థ్రిల్లర్ సినిమాలు

సన్ నెక్ట్స్ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 3) ఒకేసారి రెండు థ్రిల్లర్ సినిమాలను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. కబీర్ లాల్ ఈ రెండు మూవీస్ ను డైరెక్ట్ చేశాడు. అందులో ఒకటి తెలుగు, మరొకటి తమిళ సినిమాలు. “మీరు చూసే ముందే ఆ భయాన్ని ఫీలవ్వండి. దివ్య దృష్టి నేరుగా డిసెంబర్ 19న సన్ నెక్ట్స్ ఓటీటీలోకి వస్తోంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.

ఇక మరో తమిళ మూవీ అన్ పార్వాయిల్ కూడా అదే రోజు స్ట్రీమింగ్ కు వస్తోంది. “మీ కళ్లు మూసుకోండి.. డిసెంబర్ 19న డేంజర్ మొదలు కాబోతోంది. అన్ పార్వాయిల్ నేరుగా సన్ నెక్ట్స్ లోకి వస్తోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

ఒకడే డైరెక్టర్

ఈ రెండు సినిమాలనూ కబీల్ లాల్ డైరెక్ట్ చేశాడు. అయితే తెలుగు, తమిళంలో వేర్వేరు నటీనటులు నటించారు. తెలుగులో సునీల్ తోపాటు ఈషా చావ్లా, కమల్ కామరాజు నటించడం విశేషం. చూపు చెదిరినప్పుడు నిజం కనుమరుగైంది అనే క్యాప్షన్ ను ఈ మూవీ పోస్టర్ పై చూడొచ్చు. ఈ పోస్టర్ లో సినిమాలోని మూడు ప్రధాన క్యారెక్టర్లూ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాయి.

ఇక తమిళ సినిమాలో పార్వతీ నాయర్ తోపాటు గణేష్ వెంకటరామన్, మహేంద్రన్ నటించారు. ఈ మూవీ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. ఇందులో ఓ అమ్మాయి కళ్లకు గంతలు ఉండగా.. ఆమె చుట్టూ పగిలిన అద్దం ముక్కలు కనిపిస్తున్నాయి. వాటిలో మూవీలోని మిగిలిన పాత్రలు చూపించారు. ఈ రెండు సినిమాలూ డిసెంబర్ 19న సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More