తెలుగు టీవీ సీరియల్స్ 46వ వారం టీఆర్పీ రేటింగ్స్.. భారీగా పెరిగిన టాప్ 10 సీరియల్స్ రేటింగ్
తెలుగు టీవీ సీరియల్స్ 46వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈసారి ఇటు స్టార్ మా, అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ భారీగా పెరిగాయి. టాప్ 10లో ఎలాంటి మార్పులు లేకపోయినా.. రేటింగ్స్ విషయంలో జీ తెలుగు సీరియల్స్ కూడా మెరుగయ్యాయి.
స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించి ఈ ఏడాది 46వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతుండగా.. కేవలం అర్బన్ మార్కెట్ రేటింగ్ చూస్తే మాత్రం గుండె నిండా గుడి గంటలు టాప్ లో ఉండటం విశేషం. మరి టాప్ 10లో ఏ సీరియల్ ఎంత రేటింగ్ సాధించిందో చూద్దాం.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
తెలుగు టీవీ సీరియల్స్ విషయానికి వస్తే స్టార్ మా ఛానెల్ ఆధిపత్యం కొనసాగింది. అందులోనూ కార్తీక దీపం 2 సీరియల్ దూకుడు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం కూడా ఆ సీరియల్ రేటింగ్ 16 దాటడం విశేషం. 46వ వారం ఈ సీరియల్ రేటింగ్ 16.23గా నమోదైంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా 15.05 రేటింగ్ సాధించింది.
అర్బన్ మార్కెట్ లో 12.35 రేటింగ్ తో తొలి స్థానంలో ఉన్న గుండె నిండా గుడి గంటలు సీరియల్.. ఓవరాల్ గా ఈ వారం మరోసారి మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ సీరియల్ కు 13.80 రేటింగ్ నమోదైంది. నాలుగో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం 13.79తో తృటిలో మూడో స్థానం కోల్పోయింది.
ఇక ఐదో స్థానంలో చిన్ని సీరియల్ కొనసాగుతోంది. దీనికి తాజాగా 11.96 రేటింగ్ వచ్చింది. ఆరో స్థానంలో నిండు మనసులు సీరియల్ ఉంది. దీనికి 46వ వారం 8.94 రేటింగ్ నమోదైంది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు విషయానికి వస్తే ఈ ఛానెల్ సీరియల్స్ రేటింగ్స్ ఎంతో మెరుగయ్యాయి. టాప్ 10లో ఉన్న నాలుగు సీరియల్స్ కూడా 8 కంటే ఎక్కువ రేటింగ్ నమోదు చేయడం విశేషం. ఏడో స్థానంలో ఉన్న చామంతికి 8.53 రేటింగ్ వచ్చింది. ఇక 8వ స్థానంలో ఉన్న మేఘసందేశం 8.41తో, 9వ స్థానంలో ఉన్న జయం 8.39తో, 10 వస్థానంలో ఉన్న జగద్ధాత్రి 8.15 రేటింగ్ తో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత జీ తెలుగుకు చెందిన నాలుగు సీరియల్స్ టాప్ 10లో ఉండటమే కాదు.. అన్నీ 8కి పైగా రేటింగ్ సాధించాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


