Telugu Web Series: ఆకలి రాజ్యం అనగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ నాలుగున్నర దశాబ్దాల కిందట కమల్ హాసన్, శ్రీదేవి నటించిన కల్ట్ క్లాసిక్ మూవీయే గుర్తుకు వస్తుంది. అప్పట్లో అంతటి సంచలనం సృష్టించిన సినిమా అది. ఇప్పుడదే టైటిల్ తో ఓటీటీలోకి ఓ వెబ్ సిరీస్ వస్తుండటం, ఇంచుమించు అదే కాన్సెప్ట్ తో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ కావడం ఆసక్తి రేపుతోంది.
ప్రతి స్టూడెంట్, యూత్ స్టోరీ

ఈ ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ ను ఆహా వీడియో ఓటీటీ గత నెలలో తొలిసారి అనౌన్స్ చేసింది. తాజాగా ఈ సిరీస్ కమింగ్ సూన్ అంటూ మరో పోస్టర్ రిలీజ్ చేస్తూ స్టోరీ లైన్ ను రివీల్ చేసింది. “ముగ్గురు స్నేహితులు.. ఓ కుళ్లిపోయిన వ్యవస్థ.. వేయి కలలు.. ఓ స్టూడెంట్, యూత్, ఫ్రెండ్షిప్, తిరుగుబాటు కథ ఇది. ఆకలి రాజ్యం ఆహాలో కమింగ్ సూన్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అందులో ఈ సిరీస్ లోనూ ముగ్గురు లీడ్ క్యారెక్టర్లు తమ డిగ్రీ పట్టాలతో కనిపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది.
యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట
ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తూ గత నెల ఆహా ఓటీటీ రిలీజ్ చేసిన ప్రోమో కూడా ఆకట్టుకునేలా సాగింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివిన ప్రతి స్టూడెంట్ తర్వాత లక్ష్యం యూఎస్ఏ అంటూ ఈ ప్రోమో మొదలైంది. ఇక్కడ యూఎస్ఏ అంటే అమెరికా కాదు.. ఆ అమెరికా కలలను సాకారం చేసేందుకు తొలి అడుగు పడే యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట.
వచ్చిన ఉద్యోగంతో సర్దుకుపోయే వాళ్లు కొందరైతే.. నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లు మరికొందరు.. కథలు, కలలు, మనుషులు, ఎన్నో సంగతులు.. ఈ కథ మీదే కావచ్చు అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ కలలతో అమీర్‌పేట అక్కడి నుంచి అమెరికా వెళ్దామని కలలు కంటూ వచ్చే స్టూడెంట్స్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ లా ఈ ఆకలి రాజ్యం 2026 కనిపిస్తోంది.
ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్
{{/usCountry}}వచ్చిన ఉద్యోగంతో సర్దుకుపోయే వాళ్లు కొందరైతే.. నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లు మరికొందరు.. కథలు, కలలు, మనుషులు, ఎన్నో సంగతులు.. ఈ కథ మీదే కావచ్చు అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ కలలతో అమీర్‌పేట అక్కడి నుంచి అమెరికా వెళ్దామని కలలు కంటూ వచ్చే స్టూడెంట్స్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ లా ఈ ఆకలి రాజ్యం 2026 కనిపిస్తోంది.
ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్
{{/usCountry}}ఈ ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ ఆకలి రాజ్యం 2026ను నీలగిరి మామిళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. “ఇది ఉద్యోగం కోసం ఇల్లు వదిలిన ప్రతి స్టూడెంట్ కోసం.. వీ విల్ గెట్ బ్యాక్ టు యు అని ముగిసే ప్రతి ఇంటర్వ్యూ కోసం.. కలలు, గౌరవం, విప్లవానికి చెందిన కథ.. ఆకలి రాజ్యం 2026 ఆహాలో కమింగ్ సూన్” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా ఆహా వీడియో ఓటీటీ వెల్లడించే అవకాశం ఉంది.