Telugu Web Series: టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా కమెడియన్, హీరో వైవా హర్ష లేటెస్ట్ వెబ్ సిరీస్ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' (Least Eligible Bachelor) పోస్టర్, స్ట్రీమింగ్ డేట్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ క్యూట్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

బ్యాచ్‌లర్ లైఫ్‌లోని కామెడీ, కన్ఫ్యూజన్, పెళ్లి చూపుల డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ పోస్టర్‌ను 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. "సింగిల్‌గా ఉన్నాడు.. రెడీగా ఉన్నాడు.. కానీ మనోడు పెళ్లికి ఎలిజిబులేనా?" అంటూ ఈటీవీ విన్ టీమ్ వదిలిన క్యాప్షన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
'టిల్లు' చేతుల మీదుగా బ్యాచ్‌లర్ హంగామా
ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథాంశాలతో వస్తున్న తెలుగు ఓటీటీ కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్యాచిలర్ లైఫ్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అందుకే ఈ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సిరీస్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను సిద్ధుతో లాంచ్ చేయించడం ప్రాజెక్ట్‌పై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. పెళ్లి కోసం ఫ్రస్ట్రేట్ అవుతున్న హర్షను ఈ పోస్టర్ లో చూడొచ్చు.
యూట్యూబ్ నుంచి హీరో వరకు.. వైవా హర్ష క్రేజ్
వైవా అనే యూట్యూబ్ షార్ట్ ఫిలింతో టాలీవుడ్లో ఓవర్‌నైట్ పాపులర్ అయిన హర్ష చెముడు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా డజన్ల కొద్దీ సినిమాల్లో నవ్వించారు. 'కలర్ ఫోటో' సినిమాలో సీరియస్ రోల్‌తో మెప్పించిన హర్ష.. రీసెంట్గా 'సుందరం మాస్టర్' సినిమాతో సోలో హీరోగా మారి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు.
{{/usCountry}}వైవా అనే యూట్యూబ్ షార్ట్ ఫిలింతో టాలీవుడ్లో ఓవర్‌నైట్ పాపులర్ అయిన హర్ష చెముడు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా డజన్ల కొద్దీ సినిమాల్లో నవ్వించారు. 'కలర్ ఫోటో' సినిమాలో సీరియస్ రోల్‌తో మెప్పించిన హర్ష.. రీసెంట్గా 'సుందరం మాస్టర్' సినిమాతో సోలో హీరోగా మారి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నారు.
{{/usCountry}}ఇప్పుడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో మరోసారి పూర్తిస్థాయి కామెడీ రోల్‌లో అలరించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఈడు వచ్చిన ఒక యంగ్ కుర్రాడు పడే తిప్పలు, సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, పెళ్లి సంబంధాల చుట్టూ తిరిగే పక్కా మిడిల్ క్లాస్ హ్యూమర్‌తో ఈ సిరీస్ రూపుదిద్దుకుంది.
ఈటీవీ విన్ సక్సెస్ గ్రాఫ్.. నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్
తెలుగు నేటివిటీ ఉన్న విలేజ్ అండ్ యూత్‌ఫుల్ డ్రామాలతో 'ఈటీవీ విన్' ఓటీటీ మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. '90s: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్', 'వీరాంజనేయులు విహారయాత్ర', 'మాన్షన్ హౌస్ మల్లేష్' ఈ మధ్యే వచ్చిన గుర్తుకొస్తున్నాయి లాంటి వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ ఫిల్మ్స్ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.
అదే జోరును కొనసాగిస్తూ సెప్టెంబర్ 18న వస్తున్న 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా ఆడియన్స్‌కు అన్‌లిమిటెడ్ ఫన్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్, స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్‌మెంట్ విపరీతంగా ట్రెండింగ్‌లో నిలిచాయి.