...
...
Next Story

Telugu Web Series: దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్.. సెన్సేషనల్ ప్రోమో రిలీజ్ చేసిన ఆహా ఓటీటీ

Telugu Web Series: ఆహా వీడియో ఓటీటీలోకి ఓ రియల్ లైఫ్ స్కామ్ పై రూపొందించిన వెబ్ సిరీస్ రాబోతోంది. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమోను ఆ ఓటీటీ మంగళవారం (జులై 14) రిలీజ్ చేసింది. పదేళ్ల కిందట జరిగిన ఇండియాలోనే అతిపెద్ద స్కామ్ అంటూ ఈ ప్రోమో సాగింది.

Published on: Jul 14, 2026, 17:13:03 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Telugu Web Series: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఫ్రీడమ్ 251' స్మార్ట్‌ఫోన్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఒక భారీ తెలుగు వెబ్ సిరీస్‌ను సిద్ధం చేసింది. 'ఆజాదీ 501' (Azadi 501) పేరుతో తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అఫీషియల్ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది.

దేశాన్నే షాక్‌కు గురిచేసిన రూ.251 ఫోన్ కథ

Telugu Web Series: దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్.. సెన్సేషనల్ ప్రోమో రిలీజ్ చేసిన ఆహా ఓటీటీ
Telugu Web Series: దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్.. సెన్సేషనల్ ప్రోమో రిలీజ్ చేసిన ఆహా ఓటీటీ

చాలా మందికి 2016 కాలంలో జరిగిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ హంగామా గుర్తుండే ఉంటుంది. మొబైల్ ఫోన్ల రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్న టైమ్‌లో ఒక కంపెనీ కేవలం రూ. 251కే పూర్తి స్థాయి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ అనౌన్స్ చేసి దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ ఆన్‌లైన్ అనౌన్స్‌మెంట్ దెబ్బకు ఏకంగా 7 కోట్లకు పైగా వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్లు వచ్చాయి. తీరా చూస్తే సాధారణ కస్టమర్లకు ఆ ఫిజికల్ ఫోన్ అసలు కంటికి కూడా కనిపించలేదు.

డిజిటల్ రివల్యూషన్ లా కనిపించిన ఈ ఆఫర్ చివరకు ఒక పెద్ద కార్పొరేట్ మోసంగా తేలింది. దీనివల్ల వెండర్స్, డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ. 20 కోట్ల వరకు నష్టపోయి రోడ్డున పడ్డారు. ఈ రియల్ లైఫ్ మోసం చుట్టూ ఉన్న మిస్టరీని, ఇన్సైడ్ స్టోరీని ఒక గ్రిప్పింగ్ డ్రామా రూపంలో చూపించేందుకు ఆహా టీమ్ పక్కా స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగింది.

క్రేజీ క్యాస్టింగ్‌తో దర్శకుడి ప్లాన్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ వంశీ రంగిశెట్టి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తున్నారు. థర్స్ డే సినిమాస్ బ్యానర్‌పై రచన రెడ్డి ములుముడి ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాపులర్ యాక్టర్ కమ్ రైటర్ హర్షవర్ధన్ ఈ సిరీస్‌లో ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.

రీసెంట్‌గా ఆహా రిలీజ్ చేసిన ప్రమోషనల్ టీజర్స్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. కథకు సంబంధించిన హింట్స్ ఎక్కువగా ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. సరిగ్గా పదేళ్ల కిందట అంటే 2016లో దేశంలో ఎన్నో ఘటనలు జరిగాయి అంటూ నోట్ల రద్దుతోపాటు మరికొన్నింటి గురించి ఈ ప్రోమోలో చూపించారు. అయితే వీటన్నింటి కంటే అతిపెద్ద స్కామ్ మరొకటి జరిగింది. అదేంటో ఊహించి కామెంట్ చేయండంటూ మేకర్స్ ఈ ప్రోమోను ముగించారు.

త్వరలోనే ఈ సిరీస్ అఫీషియల్ టైటిల్ గ్లింప్స్, స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్‌కు 'ఆజాదీ 501' ఒక పర్ఫెక్ట్ వాచ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks