...
...
Next Story

OTT Telugu Web Series: జీ5 ఓటీటీలోకి 60 ఎపిసోడ్‌ల మెగా వెబ్ సిరీస్.. మర్మదేశం టీమ్ నుంచి మరో మైండ్‌బ్లోయింగ్ మిస్టరీ

OTT Telugu Web Series: జీ5 ఓటీటీలోకి మర్మదేశం టీమ్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. దీనిపేరు వీరభద్రుని రహస్యం. 60 ఎపిసోడ్ల పాటు సాగే మెగా సిరీస్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

Published on: Jun 22, 2026, 18:21:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Telugu Web Series: జీ5 తెలుగు (ZEE5 Telugu) ఓటీటీ స్పేస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అయింది. ఒకప్పటి సూపర్ హిట్ కల్ట్ క్లాసిక్ మర్మదేశం వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఏకంగా 60 ఎపిసోడ్ల లాంగ్ ఫార్మాట్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' అనౌన్స్ చేసి డిజిటల్ ఆడియన్స్‌కు మైండ్‌బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ బిగ్గెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

జూన్ 26 నుంచి వీరభద్రుని రహస్యం

OTT Telugu Web Series: జీ5 ఓటీటీలోకి 60 ఎపిసోడ్‌ల మెగా వెబ్ సిరీస్.. మర్మదేశం టీమ్ నుంచి మరో మైండ్‌బ్లోయింగ్ మిస్టరీ
OTT Telugu Web Series: జీ5 ఓటీటీలోకి 60 ఎపిసోడ్‌ల మెగా వెబ్ సిరీస్.. మర్మదేశం టీమ్ నుంచి మరో మైండ్‌బ్లోయింగ్ మిస్టరీ

ఈ మైండ్‌బ్లోయింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ జూన్ 26 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రతి వారం సరికొత్త ఎపిసోడ్లతో ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి మేకర్స్ పక్కా ప్లాన్ సెట్ చేశారు. ఈ శుక్రవారం తొలి రెండు ఎపిసోడ్లు రాబోతున్నాయి.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ 8 లేదా 10 ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపుతుంటే, జీ5 మాత్రం టెలివిజన్ హిస్టరీలోనే ఒకప్పటి కల్ట్ క్లాసిక్ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ 60 ఎపిసోడ్ల భారీ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చింది. ఒకప్పుడు బుల్లితెరపై మిస్టరీ, సస్పెన్స్, డివోషనల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన మర్మదేశం సిరీస్ గుర్తుందా? ఆ టీమ్ నుంచే ఇప్పుడీ వీరభద్రుని రహస్యం రాబోతోంది. అప్పట్లో జనాలను టీవీలకు కట్టేసే అదే వైబ్‌ను, అదే ఇంటెన్సిటీని మళ్లీ తీసుకొస్తూ హై క్వాలిటీ మేకింగ్‌తో ఈ వెబ్ సిరీస్‌ను డిజైన్ చేశారు.

వీరభద్రుని రహస్యం ప్రోమో

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటేనే అర్ధమవుతోంది.. ఇందులో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మర్మదేశం మళ్లీ మొదలైంది అనే లైన్స్ తో ఈ ప్రోమో ప్రారంభమైంది. ఒక తరాన్ని భయపెట్టిన కథ.. ఈ తరానికి పరిచయం లేని కథ అనే టెక్ట్స్ తర్వాత వస్తుంది.

పాత తరం కల్ట్ కథలకు మోడ్రన్ టెక్నికల్ వాల్యూస్ తోడైతే స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ఈ ప్రోమోతో ప్రూవ్ చేశారు. ఒక రహస్యం చుట్టూ తిరిగే కథ కావడం, అందులోనూ వీరభద్రుని టెంపుల్ లేదా డివోషనల్ మిస్టరీ టచ్ ఉండటంతో ఫ్యాంటసీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

ఈ మధ్య ఆహా, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా లాంగ్ ఫార్మాట్ వెబ్ సిరీస్ లను తీసుకొస్తున్నాయి. అయితే జీ5 మాత్రం డివోషనల్, హారర్ టచ్ ఉన్న ఈ సిరీస్ తో ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతివారం కొత్త ఎపిసోడ్లు అంటూ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు.

ఈ వీకెండ్ అంటే జూన్ 26 నుంచి జీ5 తెలుగులో ఈ మిస్టరీ రైడ్ స్టార్ట్ కాబోతోంది. మరి ఈ 60 ఎపిసోడ్ల సుదీర్ఘ ప్రయాణంలో 'వీరభద్రుని రహస్యం' ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe