OTT Telugu: అటు పెళ్లి.. ఇటు చావు.. మధ్యలో పంచాయతీ ప్రెసిడెంట్.. ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన తమిళ సూపర్ హిట్ మూవీ
ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు చావు బాధ.. ఈ రెండింటి మధ్యలో నలిగిపోయే పంచాయతీ ప్రెసిడెంట్.. ఈ స్టోరీలైన్ భలే ఫన్నీగా ఉంది కదూ. ఈ స్టోరీతోనే థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తమిళ సినిమా ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళ సినిమాలను ఓటీటీలో తెలుగు ఆడియన్స్ ఎక్కువగానే చూస్తారు. ఇక నేరుగా తెలుగులోనే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే తమిళ సినిమాలకూ క్రేజ్ బాగానే ఉంటుంది. ఫ్రెష్ కంటెంట్ తో వచ్చే చిత్రాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. అలాంటి కథతోనే వచ్చిన ‘తలైవర్ తంబి తలైమైయిల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఇవాళ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది.

తలైవర్ తంబి తలైమైయిల్ ఓటీటీ
ఓటీటీలోకి కొత్త తమిళ సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ వచ్చేసింది. గురువారం (ఫిబ్రవరి 12) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జీవా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఈ రోజు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజైంది.
తెలుగులోనూ
తలైవర్ తంబి తలైమైయిల్ సినిమా తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే హిందీ వర్షన్ రిలీజ్ పై ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు.
సైలెంట్ హిట్
సంక్రాంతి 2026 బరిలో నిలిచిన తలైవర్ తంబి తలైమైయిల్ సైలెంట్ హిట్ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.38 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రొడ్యూసర్లకు 200 శాతానికి పైగా లాభాలు తెచ్చిపెట్టింది. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జీవా, తంబి రామయ్య, ఇళవరసు, ప్రార్థన నాథన్ తదితరులు నటించారు.
తలైవర్ తంబి తలైమైయిల్ స్టోరీ
తమిళనాడులోని ఓ అందమైన పల్లెటూరి. ఆ గ్రామ పంచాయతీకి జీవరత్నం (జీవా) అధ్యక్షుడు. అంటే సర్పంచ్. ఊరిలో ఏ చిన్న శుభ కార్యమైనా, గొడవ అయినా, అశుభమైనా జీవరత్నం ఉండాల్సిందే. ఆ ఊర్లోని ఒక ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు. ఆ పెళ్లి బాధ్యతలన్నీ జీవరత్నం దగ్గరుండి చూసుకుంటాడు.
మరో రోజులో పెళ్లి అనగానే ఆ పక్క ఇంట్లోనే ఒకరు చనిపోతారు. అటు పెళ్లి, ఇటు చావు ఏదీ ఆగకూడదని రెండు కుటుంబాలు పోట్లాడుకుంటాయి. ఈగోకు పోయి ఎవరూ తగ్గరు. దీంతో మధ్యలో జీవరత్నానికి ఇబ్బందులు వస్తాయి. మరి పెళ్లి, చావు మధ్యలో సర్పంచ్ ఏం చేశాడు? ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు? అన్నది తలైవర్ తంబి తలైమైయిల్ సినిమాలో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


