నా కొడుకు ఎంజీఆర్ లాగా- సినిమాలు చేసి చాలా డబ్బు సంపాాదించగలడు-కానీ ప్రజల కోసమే ఈ నిర్ణయం: దళపతి విజయ్ తండ్రి వ్యాఖ్యలు

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో దళపతి విజయ్ తండ్రి, సినీ నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ తన తనయుడి నటన, రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే...

Published on: Dec 16, 2025 5:55 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ గురించి అతని తండ్రి, సినీ నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తనయుడి సినీ, రాజకీయ జీవితంపై మాట్లాడారు. సామాజిక స్పృహతో కూడిన చిత్రాల్లో నటించడం కొడుకు కెరీర్ మార్పునకు కారణమని ఆయన పేర్కొన్నారు.

విజయ్ తో తండ్రి చంద్రశేఖర్
విజయ్ తో తండ్రి చంద్రశేఖర్

విజయ్ తండ్రి కామెంట్లు

చెన్నైలో బిహైండ్‌వుడ్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ, నటనకే పరిమితమై ఉంటే తన కుమారుడు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలిగేవాడని అన్నారు. చంద్రశేఖర్ తన కుమారుడు దళపతి విజయ్ గురించి మాట్లాడటం ప్రారంభించగానే, ప్రేక్షకుల కేరింతలు ఎంతగా పెరిగాయంటే వారిని శాంతపరచడానికి కొంత సమయం ఇవ్వాల్సి వచ్చింది.

ప్రజలకు సేవ

‘‘మా అబ్బాయి విజయ్ - సాధారణంగా జీవితంలో డబ్బు మాత్రమే ఉందని నమ్మేవాడు కాదు. అలా అనుకుంటే అతను సులభంగా నటించి, చాలా డబ్బు సంపాదించగలడు. నేను మీ టీవీకే నాయకుడి గురించి మాట్లాడుతున్నాను. కానీ, బదులుగా తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనేది అతని ఏకైక కోరిక. అతని మనసులో ఈ ఆలోచనకు అనేక కారణాలు ఉండవచ్చు’’ అని చంద్రశేఖర్ అన్నాడు.

ఎంజీఆర్ తో పోల్చుతూ

తన కొడుకు దళపతి విజయ్ ను దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మరుదూరు గోపాలన్ రామచంద్రన్ (MGR) తో పోల్చారు చంద్రశేఖర్. వారు ఇద్దరూ తాము నటించిన సినిమాల వల్ల ప్రభావితమై ఉండవచ్చని పేర్కొన్నారు. 'అతను (విజయ్) నటించిన కొన్ని సినిమాలు కూడా కారణం కావచ్చు. అవి నటుడి హృదయంలో విత్తనాలు నాటాయి. ఎంజీఆర్ అలాంటి సినిమాల్లో నటించి నాయకుడయ్యాడు. అదేవిధంగా ఈ తరంలో విజయ్ తనలో సామాజిక స్పృహను నింపిన అనేక చిత్రాలు చేశాడు’’ అని చంద్రశేఖర్ తెలిపారు.

మురుగుదాస్ కు క్రెడిట్

తన కుమారుడి ప్రస్తుత కెరీర్ మార్గానికి దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా ఓ కారణమని చంద్రశేఖర్ క్రెడిట్ ఇచ్చారు. ‘‘ఏ.ఆర్. మురుగదాస్ నా కొడుకును ప్రభావితం చేసిన దర్శకులలో ఒకరు. విజయ్ కెరీర్ ప్రారంభంలో నేను కథలు వింటున్నప్పుడు విజయ్ తో పాటు వెళ్ళేవాడిని. విజయ్ మౌనంగా, మాటలు లేకుండా ఆనందించేవాడు. కానీ 'తుపాకీ' (2012) కథ చెప్పిన తర్వాత అతను మురుగదాస్ ను కౌగిలించుకున్నాడు. ఆ స్క్రీన్‌ప్లే వల్లనే ఈ చిత్రం ఇప్పుడు కల్ట్ అయింది’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

జన నాయగన్ తో

వెంకట్ ప్రభు దర్శకత్వంలో 2024లో వచ్చిన 'ది GOAT' చిత్రంలో చివరిసారిగా కనిపించాడు విజయ్. తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయడానికి సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. అతని చివరి చిత్రం.. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’. జనవరి 9, 2026న పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.