ఓటీటీలోనూ తిరుగులేని రష్మిక మందన్న మూవీ.. అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే.. మలయాళం హారర్ థ్రిల్లర్ కూడా..

రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీలో దూసుకెళ్తోంది. గత వారం అంటే డిసెంబర్ 8 నుంచి 14 మధ్య ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. అందులో రష్మిక మూవీ టాప్ లో ఉండటం విశేషం.

Published on: Dec 15, 2025 7:28 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాల లేటెస్ట్ జాబితా వచ్చేసింది. ప్రతి వారం ఆర్మాక్స్ మీడియా ఈ మూవీస్ లిస్ట్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ తొలి స్థానంలో ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోనూ తిరుగులేని రష్మిక మందన్న మూవీ.. అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే.. మలయాళం హారర్ థ్రిల్లర్ కూడా..
ఓటీటీలోనూ తిరుగులేని రష్మిక మందన్న మూవీ.. అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే.. మలయాళం హారర్ థ్రిల్లర్ కూడా..

ఓటీటీలో ది గర్ల్‌ఫ్రెండ్ టాప్

థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీలో మాత్రం సత్తా చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా గత వారం అంటే డిసెంబర్ 8 నుంచి 14 మధ్య అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగా నిలిచింది.

ఈ సినిమాకు 2.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి కూడా నటించిన విషయం తెలిసిందే. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే మూవీ కంటెంట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

టాప్ 5లో ఉన్న మిగిలిన సినిమాలు ఇవే

ఇక టాప్ 5లో ఉన్న మిగితా సినిమాల విషయానికి వస్తే రెండో స్థానంలో మలయాళం హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మూడో స్థానంలో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

నాలుగో స్థానంలో జాన్వీ కపూర్ నటించిన హిందీ మూవీ సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి చోటు దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ రొమాంటిక్ కామెడీ 1.4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఐదో స్థానంలో దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడిక్ డ్రామా కాంత ఉంది. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే

ఇక ఓటీటీల్లో ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను కూడా ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 తొలి స్థానంలో దీనికి ఏకంగా 4.8 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

రెండో స్థానంలో ప్రైమ్ వీడియోలోని ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఉంది. దీనికి 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఔకాత్ కే బాహర్ సిరీస్ 2 మిలియన్ల వ్యూస్ తో మూడో స్థానంలో ఉంది.

జియోహాట్‌స్టార్ లోని మహాభారత్ ఏక్ ధర్మ్‌యుద్ధ్ వెబ్ సిరీస్ కు 1.3 మిలియన్ వ్యూస్ రాగా.. ఇది నాలుగో స్థానంలో ఉంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోని హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్ 1.1 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.