ఈ సినిమా నిజంగా స్పెషల్.. నిజాయితీగా తీశారు: జాన్వీ కపూర్ మూవీకి షారుక్ ఖాన్ రివ్యూ.. ఈ ఓటీటీలో చూడండి

జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెట్వా నటించిన హోమ్‌బౌండ్ మూవీకి బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా నిజంగా చాలా స్పెషల్ అని, చాలా నిజాయితీగా తీశారని అతడు అనడం విశేషం.

Published on: Dec 10, 2025, 20:17:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా తరఫున 2026 ఆస్కార్ లకు ఎంపికైన మూవీ 'హోమ్‌బౌండ్'. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సినిమాలోని నిజాయితీ, భావోద్వేగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అతడు చెప్పాడు. ఇది నిజంగా ప్రత్యేకమైన సినిమా అని కొనియాడాడు.

ఈ సినిమా నిజంగా స్పెషల్.. నిజాయితీగా తీశారు: జాన్వీ కపూర్ మూవీకి షారుక్ ఖాన్ రివ్యూ.. ఈ ఓటీటీలో చూడండి
ఈ సినిమా నిజంగా స్పెషల్.. నిజాయితీగా తీశారు: జాన్వీ కపూర్ మూవీకి షారుక్ ఖాన్ రివ్యూ.. ఈ ఓటీటీలో చూడండి

హోమ్‌బౌండ్‌పై షారుక్ రివ్యూ ఇదే

ఆస్కార్స్ కు ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా నిలిచిన హోమ్‌బౌండ్ మూవీపై బుధవారం (డిసెంబర్ 10) ఎక్స్ వేదికగా షారుక్ రివ్యూ ఇచ్చాడు. ఇందులో అతడు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"హోమ్‌బౌండ్ మూవీ చాలా సున్నితంగా, నిజాయితీగా, మనసును తాకేలా ఉంది. ఇంత మానవీయమైన, ఆసక్తికరమైన సినిమాను సృష్టించిన అద్భుతమైన టీమ్‌కు నా ప్రేమ, నా హగ్స్. నిజంగా ప్రత్యేకమైన చిత్రాన్ని తీసి మీరు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నారు" అంటూ చిత్ర బృందాన్ని, నటీనటులైన ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్, నిర్మాత కరణ్ జోహార్‌లను ట్యాగ్ చేశాడు.

హోమ్‌బౌండ్ సినిమా కథేంటి?

షోయబ్ (ఇషాన్ ఖట్టర్), చందన్ (విశాల్ జేత్వా) అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల కథే ఈ హోమ్‌బౌండ్ మూవీ. పోలీస్ ఫోర్స్‌లో చేరాలనే ఆ ఇద్దరి కల చుట్టూ వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నదే కథాంశం. స్నేహం, విధి నిర్వహణ, భారతీయ యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఇందులో చూపించారు. జాన్వీ కపూర్ ఈ కథకు అవసరమైన ఎమోషనల్ డెప్త్‌ను అందించింది.

ఆస్కార్ రేసులో..

నవంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 2026 అకాడమీ అవార్డులలో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' విభాగంలో ఇండియా తరఫున ఈ సినిమా అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.

కరణ్ జోహార్, అదార్ పూనావాలా నిర్మించిన ఈ చిత్రానికి హాలీవుడ్ లెజెండ్ మార్టిన్ స్కోర్సెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. మరోవైపు 'డంకీ' (2023) తర్వాత షారుక్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోయే 'కింగ్' (King) చిత్రంలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో అతని కూతురు సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More