...
...
Next Story

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తున్న దళపతి విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్.. డేట్, టైమ్ రివీల్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్ ఆడియో లాంచ్ ఈ మధ్యే మలేషియాలో జరిగిన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడించింది.

Published on: Jan 2, 2026, 17:07:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

దళపతి విజయ్ తన చివరి సినిమాగా చెబుతున్న జన నాయగన్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఈ మధ్యే అంటే డిసెంబర్ 27న మలేషియాలో జరిగింది. ఆ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు. కానీ ఇప్పుడది ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

జన నాయగన్ ఆడియో లాంచ్ స్ట్రీమింగ్

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తున్న దళపతి విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్.. డేట్, టైమ్ రివీల్
ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తున్న దళపతి విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్.. డేట్, టైమ్ రివీల్

జన నాయగన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇది ఆదివారం అంటే జనవరి 4న సాయంత్రం 4.30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.

“బిగ్గెస్ట్ సౌత్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్.. ఒక ఐకాన్. ఒక చివరి గర్జన. ఒక మరచిపోలేని రాత్రి.. దళపతి తిరువీర జన నాయగన్ ఆడియో లాంచ్ జనవరి 4న జీ5లో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు సంబంధించి చిన్న టీజర్ కూడా జోడించింది.

సినిమాను వదిలేస్తున్నా..: విజయ్

ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో దళపతి విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జన నాయగనే తన కెరీర్లో చివరి మూవీ అని, అభిమానుల కోసం తాను సినిమాను వదిలేస్తున్నట్లు చెప్పాడు. ఈ ఈవెంట్ మలేషియాలోని కౌలాలంపూర్‌లోని బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగింది. ఈ వేడుకకు ఏకంగా ఒక లక్ష మంది హాజరయ్యారు. ఇది 'మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో కూడా ఎక్కింది.

రాజకీయ ప్రత్యర్థులకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తూ విజయ్ ఇలా అన్నాడు. "జీవితంలో గెలవాలంటే స్నేహితులు అవసరం లేదేమో కానీ.. ఒక బలమైన శత్రువు కచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం ఇంకా బలంగా మారుతాం. కాబట్టి, 2026లో చరిత్ర పునరావృతం అవుతుంది. ప్రజల కోసం మనం సిద్ధంగా ఉందాం" అని విజయ్ అన్నాడు.

సంక్రాంతికి అసలైన యుద్ధం

విజయ్ నటించిన జన నాయగన్ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దీనికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండబోతోంది. ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab), శివకార్తికేయన్‌ సినిమా 'పరాశక్తి' కూడా అదే సమయంలో రిలీజ్ అవుతున్నాయి.

ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ఇప్పుడు జనవరి 4న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, డైరెక్టర్లు అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe