ఒక్క టికెట్ రూ.2000.. అయినా హాట్ కేకుల్లా ఎగబడి కొనేశారు.. బెంగళూరులో విజయ్ మానియా మామూలుగా లేదు

దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ కోసం బెంగళూరులో అభిమానులు ఎగబడుతున్నారు. దీంతో టికెట్ల ధర రూ.2000 వరకు వెళ్లడం విశేషం. అయినా హాట్ కేకుల్లో ఎగబడి కొనేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి సందర్భంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Published on: Jan 5, 2026, 14:06:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న 'జన నాయగన్' (Jana Nayagan) కోసం అభిమానులు ఎగబడుతున్నారు. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ ధరలు బెంగళూరులో ఆకాశాన్నంటుతున్నాయి. స్పెషల్ మార్నింగ్ షో టికెట్ ధర ఏకంగా రూ. 2000 ఉన్నా కూడా అప్పుడే 'సోల్డ్ అవుట్' బోర్డులు కనిపిస్తున్నాయి.

ఒక్క టికెట్ రూ.2000.. అయినా హాట్ కేకుల్లా ఎగబడి కొనేశారు.. బెంగళూరులో విజయ్ మానియా మామూలుగా లేదు
ఒక్క టికెట్ రూ.2000.. అయినా హాట్ కేకుల్లా ఎగబడి కొనేశారు.. బెంగళూరులో విజయ్ మానియా మామూలుగా లేదు

బెంగళూరులో టికెట్ రేట్లు.. గుండె గుభేల్

రాజకీయాల్లోకి వెళ్లేముందు దళపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. రేట్లు చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. బెంగళూరులోని పలు థియేటర్లలో టికెట్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి.

ముకుంద థియేటర్‌లో జనవరి 9న ఉదయం 6:30 గంటలకు వేసే షో కోసం టికెట్ ధరను రూ. 1800 నుంచి రూ. 2000 వరకు నిర్ణయించారు. బుక్‌మైషోలో ఈ షో అప్పుడే హౌస్ ఫుల్ అయిపోయింది. స్వాగత్ శంకర్ నాగ్, శ్రీ వినాయక, గోపాలన్ గ్రాండ్ మాల్ వంటి థియేటర్లలో మార్నింగ్ షో టికెట్లు రూ. 1000 నుంచి రూ. 1500 వరకు ఉన్నాయి. ఇవి కూడా దాదాపు అమ్ముడయ్యాయి. కొన్ని చోట్ల మార్నింగ్ షోలకు కనీస ధర రూ. 800గా ఉంది. సాధారణ షోలు రూ. 300 నుంచి మొదలవుతున్నాయి.

కేరళలోని కొచ్చిలో అత్యధిక టికెట్ ధర కేవలం రూ. 350 ఉండగా, బెంగళూరులో మాత్రం రూ. 2000 ఉండటం గమనార్హం.

తమిళనాడులో ఇంకా ఓపెన్ కాలేదు.. ఎందుకు?

విజయ్ సొంత రాష్ట్రం తమిళనాడులో మాత్రం ఇంకా బుకింగ్స్ మొదలవ్వలేదు. సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు (CBFC) నుంచి సర్టిఫికేట్ రాలేదు. సెన్సార్ సభ్యులు కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ఇబ్బందులు రాకూడదని థియేటర్ల యాజమాన్యాలు టికెట్లను హోల్డ్‌లో పెట్టాయి. కేరళ, కర్ణాటక, ఓవర్సీస్‌లో మాత్రం బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

జన నాయగన్ సినిమా విశేషాలు

దళపతి విజయ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ జన నాయగన్ సినిమాను హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజులాంటి వాళ్లు కూడా నటించారు. ఇది బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. చివరికి ఆ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More