తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా ప్రచారం జరుగుతున్న 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
ఊహకందని రెమ్యునరేషన్

దళపతి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు నటిస్తున్న చివరి పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పింక్‌విల్లా రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా కోసం విజయ్ రికార్డు స్థాయి రెమ్యునరేషన్ అందుకున్నాడు. జన నాయగన్ కోసం ఏకంగా రూ. 275 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇది కేవలం రెమ్యునరేషన్ మాత్రమే. ఇక సినిమా లాభాల్లో అతనికి ఎలాంటి వాటా ఉండదు.
తన గత చిత్రం 'ది గోట్' కోసం విజయ్ సుమారు రూ. 200 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ రికార్డును అతడు బ్రేక్ చేయడం విశేషం.
జన నాయగన్ మూవీ గురించి..
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నిర్మిస్తున్న ఈ జన నాయగన్ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్
విడుదలకు ఇంకా సమయం ఉన్నా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సునామీ సృష్టిస్తోంది. యూకే (UK)లో బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే 12,700 టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో విజయ్ సినిమా 'లియో' (Leo) పేరిట ఉన్న 10,000 టికెట్ల రికార్డును ఇది అధిగమించింది.
{{/usCountry}}విడుదలకు ఇంకా సమయం ఉన్నా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సునామీ సృష్టిస్తోంది. యూకే (UK)లో బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే 12,700 టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో విజయ్ సినిమా 'లియో' (Leo) పేరిట ఉన్న 10,000 టికెట్ల రికార్డును ఇది అధిగమించింది.
{{/usCountry}}డిసెంబర్ 18న విడుదలైన రెండో సింగిల్ "ఒరు పేరే వరలారు" (Oru Pere Varalaaru) పాటకు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 51 ఏళ్ల వయసులోనూ విజయ్ ఎనర్జీ, డ్యాన్స్ మూవ్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ పాట విజయ్ పొలిటికల్ జర్నీని, అభిమానులతో అతనికి ఉన్న బంధాన్ని ప్రతిబింబించేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి 'జన నాయగన్' విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సెండ్-ఆఫ్ మూవీగా నిలిచేలా కనిపిస్తోంది.