ఫ్యాన్స్‌పై ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్రేమ‌.. గాల్లోకి ముద్దులు విసురుతూ.. గిఫ్ట్‌లు తీసుకుంటూ గుడ్‌ బై.. వీడియోలు వైర‌ల్‌

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా ‘జన నాయకుడు’. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా జరిగింది. అక్కడి నుంచి రిటర్న్ అవుతూ అభిమానులపై ప్రేమ కురిపించాడు విజయ్. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. 

Published on: Dec 28, 2025, 18:46:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి సినీ కెరీర్ కు ఎండ్ కార్డు పడబోతుంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ నటుడు తన చివరి సినిమా జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) అని చెప్పేశాడు. శనివారం (డిసెంబర్ 27) మలేషియాలో జన నాయకుడు ఆడియో లాంఛ్ ఈవెంట్ జరిగింది. మలేషియా నుంచి రిటర్న్ అవుతూ ఫ్యాన్స్ పై ప్రేమ కురిపించాడు విజయ్.

విజయ్
విజయ్

ఫ్యాన్స్ పై విజయ్ ప్రేమ

'జన నాయగన్' ఆడియో లాంచ్ ఈవెంట్ కోసం మలేషియాకు వెళ్లిన దళపతి విజయ్ ఆదివారం చెన్నైకి బయలుదేరాడు. ప్రయాణానికి ముందు అతను అక్కడికి తన కోసం వచ్చిన ఫ్యాన్స్ పై ప్రేమ కురిపించాడు. అభిమానులతో విజయ్ సంభాషించిన అనేక వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వెలువడ్డాయి.

గాల్లో ముద్దులు

మలేషియా నుండి బయలుదేరే ముందు విజయ్ అభిమానులను పలకరించాడు. ఒక క్లిప్ లో విజయ్ గేట్ దగ్గరకు వచ్చి, అక్కడ గుమిగూడిన ప్రేక్షకులను చూసి చిరునవ్వు నవ్వాడు. వారి వైపు చేతులు ఊపాడు. చేతులు జోడించాడు. అతను గాల్లో ముద్దులు విసిరాడు. తన అభిమానులకు వీడ్కోలు పలికి అతను వెళ్ళిపోయాడు. విజయ్ బూడిద రంగు టీ-షర్టు, లేత గోధుమరంగు జాకెట్, డెనిమ్స్ ధరించాడు.

గిఫ్ట్స్ తీసుకుని

మరొక వీడియోలో విజయ్ ఒక గుంపు దగ్గర నిలబడి ఉన్నాడు. వారు అతని కోసం హర్షధ్వానాలు చేస్తున్నారు. చేతులు ఊపిన తరువాత, వారు తన కోసం కొన్న గిఫ్ట్ లను తీసుకోవడానికి అతను వారి వైపు నడుస్తున్నట్లు కనిపించింది. విజయ్ ఒక అభిమాని నుంచి బ్యాగ్ తో పాటు మరో వ్యక్తి నుంచి బొకేను తీసుకున్నాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అతనో ఎమోషన్

విజయ్ వీడియోలపై అభిమానులు స్పందించారు. ‘‘దళపతి విజయ్ ఒక ఎమోషన్. అతను ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక భాగం" అని ఓ అభిమాని రియాక్టయ్యాడు. "అతను చాలా అందంగా ఉన్నాడు. ఎంత మధురంగా అభిమానుల నుంచి బహుమతులు తీసుకుంటున్నాడో. మలేషియాలో అభిమానులతో విజయ్ చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాడు. ఓపికగా, అతను వారిని కలుస్తున్నాడు " ఒక ఎక్స్ యూజర్ ట్వీట్ చేశారు. ‘‘అతను హృదయాలను గెలుచుకుంటున్నాడు. నిజమైన హీరో" అని ఒకరు పోస్టు చేశారు.

రికార్డ్స్ లోకి

జన నాయకుడు ఆడియో లాంఛ్ ఈవెంట్ డిసెంబర్ 27 న కౌలాలంపూర్ లోని బుకిట్ జలీల్ స్టేడియంలో జరిగింది. దీనికి దాదాపు లక్ష మంది హాజరయ్యారు. అత్యధిక ప్రేక్షకులు వచ్చిన ఆడియో లాంఛ్ గా ఇది మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ప్రవేశించింది. శ్రీలంక తరువాత ప్రపంచంలో అతిపెద్ద తమిళ ప్రవాసుల జనాభా మలేషియాలో ఉంది.

హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడు చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి, నరేన్ తదితరులు నటించారు. ఇది జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More