...
...
Next Story

మీకు అబద్ధం చెప్పను, మోసం చేయను.. మీకోసం నా లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చాను: దళపతి విజయ్ కామెంట్స్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీవీకే చీఫ్ దళపతి విజయ్ తన విమర్శలకు పదును పెట్టాడు. అధికార డీఎంకేపై విమర్శలు ఎక్కుపెట్టడంతోపాటు తాను ప్రజల కోసం తన రిచ్ లైఫ్ వదులుకున్నట్లు చెప్పాడు.

Published on: Mar 30, 2026, 20:05:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (తమిళగ వెట్రి కజగం) పార్టీ అధినేత, నటుడు దళపతి విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నాడు. సోమవారం (మార్చి 30) నాడు చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి అతడు తన నామినేషన్ వేశాడు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని, తమ పార్టీ గుర్తు అయిన విజిల్ కు ఓటు వేయాలని అతడు ప్రజలను కోరాడు.

దళపతి విజయ్ ఏమన్నాడంటే?

మీకు అబద్ధం చెప్పను, మోసం చేయను.. మీకోసం నా రిచ్ లైఫ్ వదులుకొని వచ్చాను: దళపతి విజయ్ కామెంట్స్ (PTI)
మీకు అబద్ధం చెప్పను, మోసం చేయను.. మీకోసం నా రిచ్ లైఫ్ వదులుకొని వచ్చాను: దళపతి విజయ్ కామెంట్స్ (PTI)

తన ప్రచార వాహనంపై నుంచి వేలాది మంది అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి దళపతి విజయ్ ప్రసంగించాడు. తాను ప్రజల కోసమే ఇక్కడికి వచ్చానని చెబుతూ.. అధికార డీఎంకే ఒక దుష్ట శక్తి అంటూ తాను చేస్తున్న ఆరోపణలను మరోసారి గట్టిగా వినిపించాడు.

"మనం తమిళనాడును కాపాడుకోవాలి. మన రాష్ట్రం ఇలా తయారవ్వడానికి అసలు కారణం ఎవరు? ఈ దుష్ట శక్తి డీఎంకేనే దీనికంతటికీ కారణం, స్టాలిన్ సారే దీనికి ముఖ్య కారణం. ఇది రాబోయే జనరేషన్ కోసం జరిగే ఒక సెలెక్షన్. నేను కేవలం మీ కోసమే ఇక్కడికి వచ్చాను. నాకున్న ఆ లగ్జరీ లైఫ్ ను పూర్తిగా పక్కన పెట్టేసి, మీ రుణం తీర్చుకోవడానికే ఇలా మీ ముందుకు వచ్చాను. నేను మీకు ఎప్పటికీ అబద్ధం చెప్పను, మిమ్మల్ని ఎన్నటికీ మోసం చేయను," అని అతడు అన్నాడు.

స్టాలిన్ కావాలా? విజయ్ కావాలా?

"ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న స్టాలిన్ మీకు కావాలా? లేక ప్రజలను ప్రాణంగా ప్రేమించే ఈ విజయ్ కావాలా? దయచేసి నాకు ఒక్క అవకాశం ఇచ్చి విజిల్ గుర్తుకు ఓటు వేయండి. ఈ ఎన్నికలు ఒక విజిల్ విప్లవంలా మారాలి. ఈ దుష్ట శక్తి డీఎంకే పాలనలో అసలు మనకు భద్రత ఉందా? పిల్లలు సేఫ్‌గా ఉన్నారా? మీరు ప్రశాంతంగా బతికారా? కనీస భద్రత, ఉపాధి కూడా ఇవ్వలేని ఈ డీఎంకే ప్రభుత్వంతో మనకేంటి లాభం? దీన్ని తీసి పక్కన పారేద్దామా? ఎన్నికల ముందు వాళ్ల దగ్గర గుట్టలు గుట్టలుగా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక.. ఎలాగైనా మళ్లీ గెలవాలనే కలతో ఆ డబ్బులన్నీ మీకే ఇస్తారు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు.. వాళ్లిచ్చేది అంతా తీసుకోండి. ఆ డబ్బులు తీసుకుని, వాళ్ల చెవుల్లో గట్టిగా విజిల్ ఊది వాళ్లను ఇంటికి పంపించేయండి" అని పిలుపునిచ్చాడు.

విజయ్ ఎన్నికల పోటీ ఇలా

మాదకద్రవ్యాలు లేని, స్వయం సమృద్ధ తమిళనాడును నిర్మించాలన్న తన కలను వివరిస్తూ విజయ్ పలు కీలకమైన ఎన్నికల హామీలను కూడా ప్రకటించాడు. ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రభుత్వ పరీక్షలన్నీ కరెక్ట్ టైమ్‌కి నిర్వహిస్తామని అతడు హామీ ఇచ్చాడు. యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, డిగ్రీ పూర్తయిన వాళ్లకు నెలకు రూ.4,000, డిప్లొమా చదివిన వాళ్లకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ ప్రకటించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe