Vijay: డ్రైవర్ కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన దళపతి విజయ్.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న తండ్రీకొడుకులు!
Thalapathy Vijay MLA Ticket To His Driver Son: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే (TVK) అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద 30 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు దళపతి విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తన వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సొంత డ్రైవర్, ప్రస్తుతం తన పీఏగా వ్యవహరిస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విరుగాంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు దళపతి విజయ్.

వేదికపై భావోద్వేగ దృశ్యాలు
అభ్యర్థుల ప్రకటన సమయంలో శబరినాథన్ పేరు వినబడగానే తండ్రీకొడుకులు ఇద్దరూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. శబరినాథన్ స్టేజ్ పైనే విజయ్ కాళ్లకు నమస్కరించి, ఆయనను హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చారు.
తన కోసం మూడు దశాబ్దాలుగా కష్టపడుతున్న వ్యక్తి కుమారుడు అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి విజయ్ చలించిపోయారు. స్వయంగా తన చేతులతో శబరినాథన్ కన్నీళ్లు తుడిచి అతడిని ఓదార్చారు. ఈ దృశ్యం చూసిన రాజేంద్రన్ కూడా ఆనందబాష్పాలు ఆపుకోలేకపోయారు.
విశ్వసనీయతకు దక్కిన గౌరవం
విజయ్ మొదటి సినిమా నుంచి రాజేంద్రన్ ఆయన వద్దే పనిచేస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు డ్రైవర్‌గా సేవలందించిన రాజేంద్రన్‌ను విజయ్ తన వ్యక్తిగత సహాయకుడిగా (PA) నియమించుకున్నారు. శబరినాథన్ కూడా విరుగాంబాక్కం నియోజకవర్గంలో పార్టీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
"విశ్వసనీయతకు పట్టం కట్టడం అంటే ఇదే.. తన డ్రైవర్ కొడుకును రాజకీయ నాయకుడిని చేసిన విజయ్ గొప్ప మనసు గలవాడు" అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ
ఇక మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. "నేను పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు సి. జోసెఫ్ విజయ్ అని నామినేషన్ వేస్తాను" అని విజయ్ పేర్కొన్నారు. ప్రజలతో కలిసి నిలబడే వారినే తాను అభ్యర్థులుగా ఎంపిక చేశానని ఆయన స్పష్టం చేశారు.
సినిమాలకు స్వస్తి పలికి
సినిమాలకు స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కుల వల్ల ఇంకా విడుదల కాలేదు. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


