Thandel Hillesso Hilessa Song Lyrics: తండేల్ నుంచి మరో అదిరిపోయే లవ్ సాంగ్.. హైలెస్సో హైలెస్సా లిరిక్స్ ఇవే

Thandel Hillesso Hilessa Song Lyrics: తండేల్ మూవీ నుంచి మరో అదిరిపోయే మెలోడీ సాంగ్ వచ్చేసింది. ఈ థర్డ్ సింగిల్ ను గురువారం (జనవరి 23) రిలీజ్ చేశారు. హైలెస్సో హైలెస్సా అంటూ సాగిపోయే ఈ పాట మనసుకు హత్తుకుంటోంది.

Published on: Jan 23, 2025 9:45 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Thandel Hillesso Hilessa Song Lyrics: తండేల్ మూవీ సాంగ్స్ ఒకదానిని మించి మరొకటి ఆకట్టుకుంటున్నాయి. గతంలో బుజ్జి తల్లి అంటూ జావెద్ అలీ వాయిస్ లో ఓ మరుపురాని మెలోడీ రాగా.. ఇప్పుడు హైలెస్సో హైలెస్సా అంటూ శ్రేయా ఘోషాల్, నకాష్ అజీజ్ పాడిన మరో మెలోడీ గురువారం (జనవరి 23) రిలీజైంది. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ ఎలా ఉండబోతోందో చూపిస్తూ ఈ పాట సాగింది.

తండేల్ నుంచి మరో అదిరిపోయే లవ్ సాంగ్.. హైలెస్సో హైలెస్సా లిరిక్స్ ఇవే
తండేల్ నుంచి మరో అదిరిపోయే లవ్ సాంగ్.. హైలెస్సో హైలెస్సా లిరిక్స్ ఇవే

హైలెస్సో హైలెస్సా సాంగ్

తండేల్నుంచి థర్డ్ సింగిల్ గా ఈ హైలెస్సో హైలెస్సా సాంగ్ వచ్చింది. ఈ పాటను రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. శ్రీమణి లిరిక్స్ అందించాడు. శ్రేయా ఘోషాల్, నకాష్ అజీజ్ ఈ పాట పాడారు. బుజ్జి తల్లి పాటలాగే ఈ మెలోడీ కూడా తొలిసారి వినగానే మనసును ఆహ్లాదపరిచేలా సాగింది.

డీఎస్పీ మరోసారి మాయ చేశాడు. సాయి పల్లవి స్టెప్పులు ఈ పాటకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. రగ్గ్‌డ్ లుక్ లో నాగ చైతన్య కనిపించాడు. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ తండేల్ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.

హైలెస్సో హైలెస్సా సాంగ్ లిరిక్స్ ఇవే

ఎంతెంత దూరాన్నీ నువ్వూ నేను మోస్తూ ఉన్నా..

అసలింత అలుపే రాదూ..

ఎన్నెన్ని తీరాలు నీకూ నాకు మధ్యన ఉన్నా..

కాస్తయినా అడ్డే కాదూ..

నీతో ఉంటే తెలియదు సమయం..

నువు లేకుండా ఎంతన్యాయం..

గడియారంలో సెకనుల ముల్లే గంటకి కదిలిందే..

నీతో ఉంటే కరిగే కాలం.. నువు లేకుంటే కదలను అంటూ..

నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే..

హైలెస్సో హైలెస్సా.. నీవైపే తెరచాపను తిప్పేసా

హైలెస్సో హైలెస్సా.. నువ్వొస్తావని ముస్తాబై చూశా..

గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా..

నీ ఒళ్లో వాలేదాకా.. ఉసురు ఊరుకోదూ..

రాశా రంగులతో.. ముగ్గేశా చుక్కలతో..

నిన్నే చూసేదాకా.. కనులకు నిద్దుర కనబడదూ..

నీ పలుకే నా గుండెలకే అలలు చప్పుడనిపిస్తుందే..

ఈ గాలే వీస్తుందే.. నీ పిలుపల్లే..

హైలెస్సో హైలెస్సా.. నీవైపే తెరచాపను తిప్పేసా..

హైలెస్సో హైలెస్సా.. నువ్వొస్తావని ముస్తాబై చూశా..

ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు..

కల్లో ఉండే నువ్వు.. కళ్లకెదురుగుంటే..

నేలా నింగి అంటూ.. తేడా లేనట్టు..

తారల్లోనే నడిచా నువు నా పక్కన నిలబడితే..

ఏ రంగా లేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే..

తీరాక తీర్పేగా ఈ వేదనలే..

హైలెస్సో హైలెస్సా.. నీకోసం సంద్రాలే దాటేసా..

హైలెస్సో హైలెస్సా.. నీకోసం ప్రేమంతా పోగేసా..

News/Entertainment/Thandel Hillesso Hilessa Song Lyrics: తండేల్ నుంచి మరో అదిరిపోయే లవ్ సాంగ్.. హైలెస్సో హైలెస్సా లిరిక్స్ ఇవే
News/Entertainment/Thandel Hillesso Hilessa Song Lyrics: తండేల్ నుంచి మరో అదిరిపోయే లవ్ సాంగ్.. హైలెస్సో హైలెస్సా లిరిక్స్ ఇవే