Tharun Bhascker Eesha Rebba: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, హాట్ బ్యూటీ ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌పై నెట్టింట మళ్ళీ పెను తుఫాను మొదలైంది. తరుణ్ భాస్కర్ ఇటీవల ఈషా రెబ్బాతో ఉన్న ఒక క్యూట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఆలస్యం.. అది నిమిషాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.
సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

తరుణ్ భాస్కర్ సోమవారం (సెప్టెంబర్ 14) వినాయక చవితి సందర్భంగా పోస్ట్ చేసిన ఈ పిక్ చూసిన వెంటనే ఫ్యాన్స్, మూవీ లవర్స్ కామెంట్స్ సెక్షన్లలో రచ్చ చేయడం ప్రారంభించారు. "మీ ఇద్దరి జోడీ చాలా బాగుంది", "ఆల్రెడీ అఫీషియల్‌గా జంటగా మారారా?", "మీ ఇద్దరికీ కంగ్రాచ్యులేషన్స్!" అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలో ఈ ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్ లలో కనిపించగా.. వెనుక గణపయ్యను చూడొచ్చు.
గత కొంతకాలంగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కలిసి ఈవెంట్లకు హాజరుకావడం, ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వెకేషన్ ప్లాన్స్ వేసుకోవడం ద్వారా ఈ డేటింగ్ రూమర్స్ మరింత బలపడుతూ వచ్చాయి. తాజాగా తరుణ్, ఈషా కలిసి వినాయకుడికి పూజలు చేయడం, ఆ ఫొటోను షేర్ చేయడంతో వీరు తమ బంధాన్ని దాదాపు కన్ఫర్మ్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
'పిట్ట కథలు' కనెక్షన్.. ఫ్రెండ్‌షిప్ నుంచి లవ్ వరకు..
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఆంథాలజీ 'పిట్ట కథలు'లో తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన 'రాముల' సెగ్మెంట్‌లో ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ సమయం నుంచే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. వర్క్ రిలేషన్‌షిప్‌గా ప్రారంభమైన వీరి ఫ్రెండ్‌షిప్ కాలక్రమేణా పర్సనల్ లైఫ్‌లోనూ ప్రత్యేక బంధంగా మారిందని ఇండస్ట్రీ టాక్.
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత', 'అమీ తుమీ', 'అవును 2', 'ఆహా' వంటి సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతోనూ మెప్పిస్తోంది.
తరుణ్ భాస్కర్ కెరీర్ గ్రాఫ్
{{/usCountry}}తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత', 'అమీ తుమీ', 'అవును 2', 'ఆహా' వంటి సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతోనూ మెప్పిస్తోంది.
తరుణ్ భాస్కర్ కెరీర్ గ్రాఫ్
{{/usCountry}}మరోవైపు తరుణ్ భాస్కర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ 'పెళ్లి చూపులు'తో దర్శకుడిగా టాలీవుడ్‌ను షేక్ చేశారు. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది', 'కీడా కోలా' వంటి యంగ్ అండ్ ట్రెండీ సినిమాలతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
దర్శకత్వంతో పాటు 'మీకు మాత్రమే చెప్తా', ఓం శాంతి శాంతి శాంతి:, గాయపడ్డ సింహం సినిమాల్లో హీరోగా నటించిన తరుణ్ భాస్కర్.. నటుడిగానూ విభిన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో ఈషా రెబ్బాతో రిలేషన్ వార్తలతో మళ్ళీ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు.
ఇంత జరుగుతున్నా వీళ్లిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. మరి ఈ వైరల్ పిక్ తర్వాత అయినా వీరిద్దరూ తమ లవ్ స్టోరీపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.