టైమ్ చూసి నేనే చెప్తా: ఈషా రెబ్బతో పెళ్లిపై తరుణ్ భాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ ఈషా రెబ్బతో రిలేషన్షిప్, పెళ్లిపై తరుణ్ భాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టైమ్ చూసి తానే చెప్తానని అని అనడం విశేషం. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఓం శాంతి శాంతి శాంతి: మూవీ ప్రమోషన్లలో భాగంగా అతడు ఈ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతున్న రిలేషన్షిప్ రూమర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బదే. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో అటు ఈషా, ఇటు తరుణ్ వీటిపై స్పందించారు. ఒక రోజు ముందే ఈషా ఈ వార్తలను ఖండించగా.. తరుణ్ మాత్రం టైమ్ వచ్చినప్పుడు చెప్తానంటూ ఇంకా ఉత్కంఠను పెంచాడు.

తరుణ్ ఏమన్నాడంటే?
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ కలిసి నటించిన ఓం శాంతి శాంతి శాంతి: మూవీ ఈ శుక్రవారం (జనవరి 30) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్.. ఈషాతో తన రిలేషన్షిప్ పై మాట్లాడాడు. “దీనిని అనౌన్స్ చేయడానికి నేను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. ఈషా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ. ఒక తోడుగా, గత కొన్నేళ్లుగా ఆమె నాకు అన్నీ తానై ఉంది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అయితే ఇది నా వ్యక్తిగత విషయం కాబట్టి నేను చేసే ప్రకటన ఇతరులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఆచి తూచి, ఆలోచించి అడుగు వేయాలనుకుంటున్నాను" అని వివరించాడు.
త్వరలోనే ప్రకటిస్తాం..
తరుణ్ దీనిపై ఇంకా మాట్లాడుతూ.. "నేను ఏం మాట్లాడుతున్నానో అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ముఖ్యంగా నా మాటలు ఇతరులపై ప్రభావం చూపేటప్పుడు ఇంకాస్త బాధ్యతగా ఉండాలి. అంతా సవ్యంగా జరిగి, దేవుడి దయ ఉంటే.. త్వరలోనే మేము ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తాం" అని చెప్పడం గమనార్హం. తరుణ్ చేసిన ఈ కామెంట్స్ తో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కన్ఫమన్న అంచనాకు అభిమానులు వచ్చారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని ఆశిస్తున్నారు.
ఈషా రెబ్బ ఏమన్నదంటే?
అటు ఈషా రెబ్బ కూడా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే ఈ పుకార్లపై స్పందించింది. “నేను కూడా ఆ పుకార్ల గురించి విన్నాను. దీనిపైనే నేను ఫన్నీ ఇన్‌స్టా రీల్ కూడా చేశాను. ఈ వార్తలు విని మా నాన్న కూడా నా పెళ్లెప్పుడు అని అడిగాడు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా జీవితంలో నా నియంత్రణలో లేని వాటి గురించి మాట్లాడను. అలాంటిదేమైనా ఉంటే మీకు ముందే చెబుతాను” అని ఈషా స్పష్టం చేసింది.
అయితే ఈషా రెబ్బ డేటింగ్ లో మాత్రం ఉన్నదట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నదని తెలిపింది. అది ఎవరన్నది మాత్రం చెప్పలేదు. నిజానికి గతేడాది దీపావళి సందర్భంగా ఈషా, తరుణ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలు బయటకు రావడంతో వీరి మధ్య రిలేషన్షిప్ పుకార్లు మరింత పెరిగాయి. ఇప్పుడు ఓ సినిమాలో కలిసి నటించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


