పెళ్లి చూపులు యావరేజ్ సినిమా.. ఓవర్‌హైప్ అయిందంతే: తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం ట్రైజర్ చూశారా.. కేజీఎఫ్ స్టైల్ ఇంట్రో

తరుణ్ భాస్కర్ మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి వస్తున్నాడు. అతడు నటించిన గాయపడ్డ సింహం మూవీ ట్రైజర్ (Traiser) సోమవారం (ఫిబ్రవరి 9) రిలీజైంది. అమెరికా వెళ్దామని కలలు కనే యువకుడు ట్రంప్ దెబ్బకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో చెప్పే మూవీ ఇది.

Published on: Feb 9, 2026, 15:27:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా వెళ్లాలని పిచ్చితో ఊగిపోయే వారిపై సూపర్ సెటైరికల్ మూవీ వచ్చేస్తోంది. ట్రంప్ వచ్చిన తర్వాత అలాంటి వారి పరిస్థితి ఎలా మారిందో చెప్పే సినిమా ఇది. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ పేరు 'గాయపడ్డ సింహం'. కొత్త డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైజర్ (traiser) తాజాగా విడుదలైంది. అమెరికా వెళ్లాలని కలలు కనే యువకుడి ఆశలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రాబోతోంది.

పెళ్లి చూపులు యావరేజ్ సినిమా.. ఓవర్‌హైప్ అయిందంతే: తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం ట్రైజర్ చూశారా.. కేజీఎఫ్ స్టైల్ ఇంట్రో
పెళ్లి చూపులు యావరేజ్ సినిమా.. ఓవర్‌హైప్ అయిందంతే: తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం ట్రైజర్ చూశారా.. కేజీఎఫ్ స్టైల్ ఇంట్రో

గాయపడ్డ సింహం ట్రైజర్ రిలీజ్

'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఇప్పుడు హీరోగానూ సత్తా చాటుతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'గాయపడ్డ సింహం'. జీ స్టూడియోస్, సప్తశ్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ సాదినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. సోమవారం (ఫిబ్రవరి 9) విడుదలైన టీజర్ కమ్ ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సినిమాకు డోన్ట్ లాఫ్.. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అనే ట్యాగ్ లైన్ పెట్టడం విశేషం.

ట్రంప్ తెచ్చిన కష్టాలు.. మూవీ కథేంటంటే..

ఈకాలం యువతలో చాలామందికి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనే పిచ్చి ఉంటుంది. ఈ పాయింట్‌నే ప్రధాన కథాంశంగా తీసుకుని దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఈ కథను రాసుకున్నాడు. హీరోకి అమెరికా వెళ్లాలనేది జీవిత ఆశయం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా భారీ ఎత్తున 'డిపోర్టేషన్' (దేశం నుంచి పంపించివేయడం) డ్రైవ్ ప్రకటిస్తారు.

దీంతో హీరో కలలు ఎలా కల్లలయ్యాయి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. ఈ సీరియస్ అంశాన్ని దర్శకుడు పూర్తి సెటైరికల్ వేలో, నవ్వులు పూయించేలా తీర్చిదిద్దారు. ట్రైజర్ చివర్లో పెళ్లి చూపులు యావరేజ్ మూవీ.. ఓవర్‌హైప్ అయిందంతే అంటూ తన మూవీపై తానే సెటైర్ వేసుకోవడం హైలైట్.

కేజీఎఫ్ స్టైల్ నెరేషన్.. ఫరియా సందడి

ట్రైలర్ ఆరంభమే చాలా ఆసక్తికరంగా ఉంది. గందరగోళంగా ఉన్న కథనాన్ని 'కేజీఎఫ్' (KGF) సినిమా స్టైల్‌లో ఫరియా అబ్దుల్లా, శుభలేఖ సుధాకర్‌ను అడుగుతూ.. "సింపుల్‌గా చెప్పు తాతా" అని అడగడం నవ్వు తెప్పిస్తుంది. ఓవర్-ది-టాప్ నెరేషన్‌తో వీరిద్దరూ ఆకట్టుకున్నారు.

అమాయకత్వంతో కూడిన ఉత్సాహం, ఆశలు ఆవిరైనప్పటి ఫ్రస్ట్రేషన్.. ఇలా రెండు వేరియేషన్స్‌లో తరుణ్ భాస్కర్ నటన, అతని కామెడీ టైమింగ్ అదిరిపోయింది. హీరో ఫ్రెండ్‌గా విష్ణు ఓయ్ తనదైన మార్క్ కామెడీతో ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాడు. మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. స్వీకర్ అగస్తీ సంగీతం, విద్యాసాగర్ చింతా విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More