రాత్రి 2 గంటలకు క్యాబ్ డ్రైవర్‌తో గొడవ.. విష్వక్ సేన్ వచ్చి ఏం చేశాడంటే.. తరుణ్ భాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు
హీరో కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో విష్వక్ సేన్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ఉంది. మిడ్ నైట్ కాల్ చేసినా విష్వక్ తన కోసం వస్తాడని రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి తరుణ్ చెప్పుకొచ్చాడు.
తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్ లో విష్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కచ్చితంగా ఉంటారు. కెరీర్ ఆరంభంలో విష్వక్ సేక్ కు ఈ నగరానికి ఏమైంది? లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన దర్శకత్వ కెరీర్ పరంగానూ అది ప్లస్ అయింది. విష్వక్ సేన్ తో తన స్నేహం గురించి చెప్తూ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు తరుణ్.

క్యాబ్ డ్రైవర్ తో గొడవ
తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ప్రమోషన్లలో భాగంగా తరుణ్ భాస్కర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు.
‘‘రీసెంట్ గా రాత్రి 2 గంటలకు ఊబర్ క్యాబ్ డ్రైవర్ తో గొడవైంది. రెండు స్టాప్స్ పెడితే పెట్టొద్దంటాడు. మరి యాప్ లో ఎందుకిచ్చారు? నాకు సంబంధం లేదు కదా. వాడితో గొడవ అయితుంటే విష్వక్ కాల్ చేశాడు. ఎక్కడున్నావ్ అని అడిగాడు. క్యాబ్ డ్రైవర్ తో గొడవ అనగానే వాడి బండేసుకుని వచ్చాడు’’ అని తరుణ్ భాస్కర్ చెప్పాడు.
పోలీస్ అని
‘‘టీషర్ట్ తో ఫేస్ కవర్ చేసుకుంటూ పోలీస్ ను బండి తీయ్ అని విష్వక్ బెదిరించాడు. అరే నువ్వు పోలీసులా లేవు, అది పోలీసు బండిలా లేదు అని నేనన్నా. విష్వక్ అంటే అదే. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు. రాత్రి 2 గంటలకు కాల్ చేసి లొల్లి అయితుందంటే వచ్చేస్తాడు’’ అని తరుణ్ భాస్కర్ పేర్కొన్నాడు.
విజయ్ దేవరకొండకు కాల్
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఇదే ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విజయ్ కు కాల్ చేశాడు తరుణ్. ‘‘కాల్ లిఫ్ట్ చేయవనుకున్నా. నేను ఇంటర్వ్యూలో ఉన్నా. ఇక్కడ వీడీ14 టైటిల్ ఏంటీ అని అడుగుతుంటే అదే టైటిల్ అని చెప్తున్నా’’ అని విజయ్ తో మాట్లాడతాడు తరుణ్. ‘‘టైటిల్ రణబాలి’’ అని చెప్పేస్తాడు విజయ్. అదే విజయ్ అంటే, ఫ్రెండ్స్ దగ్గర ఏదీ దాచడని తరుణ్ అంటాడు.
ఈ సినిమాలు
విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటుడిగా సినిమాలు చేస్తున్న తరుణ్ భాస్కర్.. మరోవైపు ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2తో బిజీగా ఉన్నాడు. ఇక అతను హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ఓం శాంతి శాంతి శాంతి: మూవీ జనవరి 30న రిలీజైంది.
ఇక విష్వక్ సేన్ ఏమో ఫంకీ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ ఏమో రణబాలి షూటింగ్ లో బిజీ అయిపోయాడు.

E-Paper












