అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ దూసుకెళ్తూనే ఉంది. సమంత భర్త రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గత వారం అంటే నవంబర్ 24 నుంచి 30 మధ్య 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 దూకుడు

ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టును రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నవంబర్ 24 నుంచి 30తో ముగిసిన వారానికి సంబంధించి కూడా ఈ లిస్టు తీసుకొచ్చింది. ఇందులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తొలి స్థానంలో నిలిచింది.
దీనికి గత వారం 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. నాలుగేళ్లుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూసిన అభిమానులు.. నవంబర్ 21న స్ట్రీమింగ్ ప్రారంభం కాగానే ఎగబడి చూస్తున్నారు. దీంతో రెండు వారాలుగా ఇది తొలి స్థానంలోనే ఉంటోంది. మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి నటించిన సిరీస్ ఇది.
టాప్ 5లోని మిగిలిన వెబ్ సిరీస్ ఇవే
ఇక టాప్ 5లో రెండో స్థానంలో ఉన్న వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. గత శుక్రవారం (నవంబర్ 28) తొలి నాలుగు ఎపిసోడ్లు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 3.5 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. మూడో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 ఉంది. దీనికి 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నాలుగో స్థానంలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి వచ్చిన కో-ఎడ్ అనే వెబ్ సిరీస్ ఉంది. ఈ సిరీస్ కు గత వారం 2.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దీనికి ఫ్రీగానే చూడొచ్చు. ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న జిద్దీ ఇష్క్ ఉంది. ఈ సిరీస్ కు 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
{{/usCountry}}నాలుగో స్థానంలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి వచ్చిన కో-ఎడ్ అనే వెబ్ సిరీస్ ఉంది. ఈ సిరీస్ కు గత వారం 2.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దీనికి ఫ్రీగానే చూడొచ్చు. ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న జిద్దీ ఇష్క్ ఉంది. ఈ సిరీస్ కు 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
{{/usCountry}}