Christopher Nolan: అప్పుడు ఫిల్మ్ స్కూల్ వద్దనుకున్న డైరెక్టరే ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి.. నోలన్ స్టోరీ
Christopher Nolan: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సక్సెస్ స్టోరీ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒకప్పుడు ఫిల్మ్ స్కూల్ వద్దని రిజెక్ట్ చేసిన ఆ డైరెక్టరే ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు.
Christopher Nolan: హాలీవుడ్ విజనరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) మొదటి వీకెండ్‌లోనే 262.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,500 కోట్లు) గ్రాస్ రాబట్టి గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తన గత ఆస్కార్ విన్నింగ్ మాస్టర్‌పీస్ 'ఓపెన్‌హైమర్' రికార్డులను కూడా తుడిచిపెట్టేసిన ఈ డైరెక్టర్.. ఒకప్పుడు ఒక ఫిల్మ్ స్కూల్‌లో అడ్మిషన్ కోసం వెళ్తే అసలు టాలెంట్ లేదు పొమ్మని రిజెక్ట్ చేశారనే నిజం ఎంతమందికి తెలుసు?

ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, ది డార్క్ నైట్ ట్రయాలజీ లాంటి మైండ్ బెండింగ్ క్లాసిక్స్ అందించిన నోలన్.. ఇప్పుడు హాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా వెలుగుతున్నారు. కానీ కెరీర్ ప్రారంభంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఎదురుదెబ్బలు ఏ సాధారణ డైరెక్టర్‌కైనా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి.
ఫిల్మ్ స్కూల్ రిజెక్ట్ చేసిన జీనియస్
లండన్‌లో పెరిగిన నోలన్‌కు 10 ఏళ్ల వయసు నుంచే సినిమాలపై పిచ్చి ఉండేది. చిన్నతనంలో బొమ్మలతో షార్ట్ వీడియోలు తీస్తూ పెరిగిన ఆయన.. ఫిల్మ్ స్కూల్‌లో చేరి డైరెక్షన్ నేర్చుకుందామని ట్రై చేస్తే అడ్మిషన్ ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్ నిరాకరించింది. "ఫిల్మ్ స్కూల్‌కు వెళ్లడం నాకిష్టం లేకపోవడం కాదు.. ఆ ఫిల్మ్ స్కూలే నన్ను వద్దనుకుంది" అని నోలన్ గతంలో ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
అయినా అధైర్యపడకుండా లండన్ యూనివర్సిటీ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. అదే ఆయన స్క్రీన్‌ప్లే రైటింగ్ స్కిల్స్‌ను, కథలోని ఎమోషన్స్‌ను డిఫరెంట్ యాంగిల్‌లో బిల్డ్ చేయడానికి బాగా ఉపయోగపడింది. "సినిమా ప్లాప్ అయితే అది నా తప్పే.. నా పద్ధతిలోనే ఓడిపోతాను" అంటూ ఆయన అప్పట్లోనే రియలిస్టిక్ ఆటిట్యూడ్‌తో ముందడుగు వేశారు.
$250 మిలియన్ల నెట్‌వర్త్
ప్రస్తుతం 55 ఏళ్ల వయసులో హాలీవుడ్ దిగ్గజంగా మారిన క్రిస్టోఫర్ నోలన్ నెట్ వర్త్ దాదాపు $250 మిలియన్లు (సుమారు రూ. 2,400 కోట్లు). 2024 లో 'ఓపెన్‌హైమర్' చిత్రానికి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ విభాగాల్లో ఆస్కార్ అందుకున్న ఆయన.. ఇప్పుడు $250 మిలియన్ల భారీ బడ్జెట్‌తో హోమర్ ఎపిక్ ఆధారంగా 'ది ఒడిస్సీ'ని ఐమాక్స్ కెమెరాలతో అద్భుతంగా ప్లాన్ చేశారు.
మ్యాట్ డామన్, యాన్ హాత్వే, టామ్ హాలండ్ లాంటి ప్రెస్టీజియస్ స్టార్ కాస్టింగ్‌తో వచ్చిన ఈ సినిమాకు రాటెన్ టొమాటోస్‌లో 95 శాతం రేటింగ్ రావడం ఆయన టాలెంట్‌కు నిదర్శనం. ఎంత ఎత్తుకు ఎదిగినా కొత్త సినిమా రిలీజ్ అయ్యే ముందు తనలో ఆందోళన, భయం అలాగే ఉంటాయని, ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ మాత్రమే సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేస్తుందని ఆయన వినయంగా చెప్పారు.
జేమ్స్ కేమరాన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా అంతే!
నోలన్ మాత్రమే కాదు, హాలీవుడ్‌ను శాసిస్తున్న జేమ్స్ కేమరాన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూడా ఎలాంటి ఫిల్మ్ స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చినవారే. 'టైటానిక్', 'అవతార్' లాంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్స్ అందించిన జేమ్స్ కేమరూన్ కాలేజ్ చదువు మధ్యలోనే ఆపేసి ట్రక్ డ్రైవర్‌గా, క్లీనర్‌గా పనిచేశారు. లైబ్రరీలకు వెళ్లి సొంతంగా విజువల్ ఎఫెక్ట్స్ బుక్స్ చదువుకుని హాలీవుడ్‌ను షేక్ చేశారు.
అలాగే 'జురాసిక్ పార్క్', 'ఇండియానా జోన్స్' లాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ తీసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూ. 59,000 కోట్ల ($7.1 బిలియన్) ఆస్తికి అధిపతిగా మారడానికి ముందు తోటల్లో చిన్న చిన్న పనులు చేసి సినిమాలు తీయడానికి డబ్బులు సమకూర్చుకున్నారు. డిగ్రీలు, అడ్మిషన్లు సాధించలేకపోయినా, మనసుకు నచ్చిన పనిని పట్టుదలతో చేస్తే విజయం ఖచ్చితంగా తలుపు తడుతుందని ఈ లెజెండ్స్ నిరూపించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


