Cristopher Nolan: నోలన్ నోట ‘ఆర్ఆర్ఆర్’ మాట..రాజమౌళి విజువల్ వండర్ పై సంచలన వ్యాఖ్యలు.. ది ఒడిస్సీ డైరెక్టర్ ఏమన్నారంటే?

Cristopher Nolan RRR: ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తాజాగా టాలీవుడ్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ 'RRR' చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ సక్సెస్ తో కొత్త అవకాశాలు వచ్చాయంటూ ప్రశంసలు కురిపించారు. ది ఒడిస్సీ డైరెక్టర్ ఇంకా ఏమన్నారో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 19, 2026, 16:49:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Cristopher Nolan RRR: భారతీయ చలనచిత్ర పరిశ్రమను, ముఖ్యంగా టాలీవుడ్‌ను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టిన 'ఆర్ఆర్ఆర్ (RRR)' చిత్రం రిలీజై ఇన్నేళ్లవుతున్నా అంతర్జాతీయ వేదికలపై దీని క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. తాజాగా లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

నోలన్ నోట ‘ఆర్ఆర్ఆర్’ మాట..రాజమౌళి విజువల్ వండర్ పై సంచలన వ్యాఖ్యలు.. ది ఒడిస్సీ డైరెక్టర్ ఏమన్నారంటే?
నోలన్ నోట ‘ఆర్ఆర్ఆర్’ మాట..రాజమౌళి విజువల్ వండర్ పై సంచలన వ్యాఖ్యలు.. ది ఒడిస్సీ డైరెక్టర్ ఏమన్నారంటే?

ఆర్ఆర్ఆర్ పై నోలన్ ప్రశంసలు

క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త సినిమా 'ది ఒడిస్సీ' ప్రీమియర్ ఈవెంట్ కోసం ఇండియా వచ్చిన సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. గ్లోబల్ సినిమా రీచ్ గురించి మాట్లాడుతూ ఆయన 'ఆర్ఆర్ఆర్ (RRR)' సినిమాను ఉదాహరణగా తీసుకున్నారు.

గతంలో సాంప్రదాయ చలనచిత్ర పంపిణీ వ్యవస్థలు (Traditional Distribution Systems) వేర్వేరు చిత్ర పరిశ్రమలను, భాషలను ఒకదానికొకటి సంబంధం లేకుండా విడివిడిగా ఉంచేవని ఆయన గుర్తు చేశారు.

కొత్త అవకాశాలు

అయితే ఇప్పుడు ఆ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయాయని, అమెరికా థియేటర్లలో 'RRR' సాధించిన అపూర్వమైన థియేట్రికల్ విజయం దీనికి సజీవ సాక్ష్యమని నోలన్ స్పష్టం చేశారు. "ఒక ప్రాంతీయ సినిమా అమెరికా లాంటి అతిపెద్ద మార్కెట్లోకి దూసుకెళ్లి ఘనవిజయం సాధించినప్పుడు, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దర్శకులకు సైతం గ్లోబల్ ఆడియన్స్‌ను చేరుకోవడానికి సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంది" అని ఆయన విశ్లేషించారు.

వీడియో షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్

నోలన్ మాట్లాడిన ఈ అరుదైన వీడియో క్లిప్‌ను 'RRR' చిత్ర బృందం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ, ఈ హాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ప్రశంసల వెనుక

క్రిస్టోఫర్ నోలన్ వంటి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి సినిమాను ప్రశంసించడం వెనుక కేవలం అభినందన మాత్రమే లేదు.. ఒక పెద్ద బిజినెస్ షిఫ్ట్ ఉంది. నోలన్ ఎప్పుడూ 'ప్యూర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్' (సినిమాను థియేటర్లలోనే చూడటం)ను బలంగా నమ్ముతారు.

'RRR' సినిమా కూడా కేవలం ఓటీటీలోనే కాకుండా, అమెరికాలోని వందలాది థియేటర్లలో మాస్ సెలబ్రేషన్స్‌ను క్రియేట్ చేసింది. వెస్ట్రన్ ఆడియన్స్‌కు ఒక సరికొత్త థియేట్రికల్ కిక్ ఇచ్చింది. అందుకే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీసే నోలన్ సైతం.. ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాను ఒక గ్లోబల్ కేస్ స్టడీగా అభివర్ణించారు. ఇది టాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లాయని చెప్పడానికి మరో నిదర్శనం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More