The Paradise Teaser: 'దసరా' వంటి ఊరమాస్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ టీజర్ అప్‌డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రివీల్ చేశారు.

రేపు అంటే గురువారం (ఆగస్ట్ 6) సాయంత్రం 6 గంటలకు 'ది ప్యారడైజ్' రఫ్ అండ్ రఫ్ టీజర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక షాకింగ్ ఇంటెన్స్ పోస్టర్‌ను వదిలారు.
రక్తం చిందిస్తున్న పిడికిలి.. రేజర్ బ్లేడ్లతో ఊరమాస్ లుక్
తాజాగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. కటిక చీకటి బ్యాక్‌డ్రాప్‌లో రక్తంతో తడిసిపోయిన పిడికిలి, దానికి చుట్టిన నల్లటి తాడు, ఆ తాడుకు కట్టిన పదునైన రేజర్ బ్లేడ్లు చూస్తుంటే ఈ సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది.
ఈ చిత్రంలో నాని 'జడల్' (Jadal) అనే అత్యంత శక్తివంతమైన, తిరుగుబాటుదారుడి పాత్రలో కనిపిస్తున్నారు. బాధ, తిరుగుబాటు, పట్టుదలకు ప్రతీకగా రూపుదిద్దిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారా స్థాయికి తీసుకెళ్లింది.
95 సెకన్ల విధ్వంసం.. అనిరుధ్ బీజీఎం నెక్స్ట్ లెవెల్
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ఈ టీజర్ నిడివి దాదాపు 95 సెకన్లు ఉండబోతోంది. నాని రఫ్ విజువల్స్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడై టీజర్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
'దసరా'లో మాస్ ఎమోషన్‌ను పీక్స్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి 'ది ప్యారడైజ్' కోసం మరింత రా అండ్ రస్టిక్ యాక్షన్ వరల్డ్‌ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ పోస్టర్‌ను ట్రెండ్ చేస్తూ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.
బిగ్ స్టార్ కాస్టింగ్.. సీనియర్ నటుల దండయాత్ర
{{/usCountry}}'దసరా'లో మాస్ ఎమోషన్‌ను పీక్స్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి 'ది ప్యారడైజ్' కోసం మరింత రా అండ్ రస్టిక్ యాక్షన్ వరల్డ్‌ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ పోస్టర్‌ను ట్రెండ్ చేస్తూ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు.
బిగ్ స్టార్ కాస్టింగ్.. సీనియర్ నటుల దండయాత్ర
{{/usCountry}}ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నాని సరసన యంగ్ బ్యూటీ కయదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండటం బిగ్ హైలైట్‌గా మారనుంది.
వీరితో పాటు బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి, రాఘవ్ జుయల్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతమంది వర్సటైల్ యాక్టర్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో ప్రాజెక్ట్ రేంజ్ పెరిగిపోయింది.
సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్
ఎస్ ఎల్ వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో, కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
అన్ని భాషల ఆడియన్స్‌ను అలరించేలా ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. రేపు రాబోయే టీజర్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.