The Paradise Trailer: నేచురల్ స్టార్ నాని తన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise) విషయంలో ఎవ్వరూ ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి అసలు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం లేదని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నాని స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
ప్రెస్ మీట్‌లో నాని క్లారిటీ.. అసలు కారణం ఏంటంటే?

ది ప్యారడైజ్ మూవీ ట్రైలర్ రావడం లేదనే వార్తలతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ ప్రచారమయ్యాయి. వీటిపై క్లారిటీ ఇవ్వడానికే నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, మల్టిపుల్ యూనిట్స్ ఒకేసారి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాయని నాని చెప్పారు. సరైన ట్రైలర్ కట్ చేయడానికి సరిపడా టైమ్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
హడావుడిగా ఒక ట్రైలర్ కట్ చేసి వదిలేకంటే, ఆ టైమ్‌ని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ కోసం కేటాయించడమే కరెక్ట్ అని టీమ్ భావించినట్లు తెలిపారు. సినిమా కోసం ఎంత కష్టపడుతున్నామో, ప్రేక్షకుల నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నామని నాని స్పష్టం చేశారు.
"సినిమానే ముఖ్యం.. ఆడియన్స్‌ను లైట్ తీసుకోవట్లేదు!"
"ట్రైలర్ కంటే థియేటర్లలోకి వచ్చే సినిమా క్వాలిటీనే మాకు చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని నమ్ముతున్నాం. అలాగని ఆడియన్స్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఒకవేళ హడావుడిగా ట్రైలర్ కట్ చేస్తే మేం అనుకున్న అవుట్‌పుట్ రాదు. అందుకే నేరుగా బిగ్ స్క్రీన్ మీదే మా విశ్వరూపం చూపిస్తాం" అని నాని ధీమా వ్యక్తం చేశారు.
సరిపడా టైమ్ లేకపోయినా క్వాలిటీ పోకుండా పర్ఫెక్ట్ ప్రాడక్ట్ ఇవ్వడానికే రాత్రీపగలూ కష్టపడుతున్నట్లు నాని చెప్పారు. సినిమాపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, బాక్సాఫీస్ దగ్గర సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని హామీ ఇచ్చారు.
రూమర్స్ కు చెక్ పెట్టిన నేచురల్ స్టార్
{{/usCountry}}సరిపడా టైమ్ లేకపోయినా క్వాలిటీ పోకుండా పర్ఫెక్ట్ ప్రాడక్ట్ ఇవ్వడానికే రాత్రీపగలూ కష్టపడుతున్నట్లు నాని చెప్పారు. సినిమాపై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, బాక్సాఫీస్ దగ్గర సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని హామీ ఇచ్చారు.
రూమర్స్ కు చెక్ పెట్టిన నేచురల్ స్టార్
{{/usCountry}}గత కొద్దిరోజులుగా ఇంటర్నెట్‌లో 'ది ప్యారడైజ్' మూవీకి సంబంధించి అనేక వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో భారీ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని, ఏకంగా 1000 మంది ఫైటర్లతో ఒక బిగ్గేస్ట్ యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేశారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ వార్తలపై నేచురల్ స్టార్ నాని స్పందిస్తూ, "సినిమాలో ఎలాంటి అండర్‌వాటర్ ఫైట్ లేదు.. అలానే 1,000 మందితో చేసిన యాక్షన్ సీన్ కూడా ఏదీ ప్లాన్ చేయలేదు" అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హైప్ కోసం సృష్టించిన ఇలాంటి ఫేక్ వార్తలను అభిమానులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలపై వచ్చిన ప్రచారం నిజమేనా?
షూటింగ్ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సెట్స్‌లో కొందరిపై చెయ్యి చేసుకున్నారంటూ వచ్చిన రూమర్స్‌పై కూడా నాని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. "శ్రీకాంత్ ఎవరినీ కొట్టలేదు, అసలు సెట్స్‌లో ఎలాంటి గొడవలు జరగలేదు" అని తేల్చిచెప్పారు.
దీంతో పాటు సినిమాలో నాని క్యారెక్టర్ 'జడల్' జడ బరువు 6 కేజీలు ఉందంటూ వస్తున్న వార్తలను నాని పూర్తిగా ఖండించారు. పాత్ర లుక్ డిజైన్ చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది తప్ప, ప్రచారంలో ఉన్న లెక్కలన్నీ అబద్ధాలని నాని క్లారిటీ ఇచ్చారు.
సంచలనాలు సృష్టిస్తున్న 'దసరా' కాంబినేషన్
బ్లాక్‌బస్టర్ హిట్ 'దసరా' తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో 'ది ప్యారడైజ్' పై ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ హైప్ ఉంది. శ్రీకాంత్ ఓదెల విజన్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో పీక్స్ లో ఉండబోతున్నాయి. 'సరిపోదా శనివారం' సక్సెస్ తర్వాత నాని నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ రేంజ్ ఏంటో ట్రేడ్ లెక్కలే చెబుతున్నాయి.
ట్రైలర్ లేకుండానే సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం టాలీవుడ్‌లో ఒక రేర్ అండ్ బోల్డ్ అటెంప్ట్ అని చెప్పాలి. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్స్ పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేసి ఆడియన్స్ ముందుకు రావడమే తమ ప్రైమరీ గోల్ అని మూవీ టీమ్ తేల్చిచెప్పేసింది. మరి ఈ బోల్డ్ ప్లాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.