పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ జర్నీ పడుతూ లేస్తూ సాగుతోంది. మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. ప్రభాస్ కెరీర్‌లోని భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల సరసన నిలవలేకపోయింది. అయినప్పటికీ ఇండియాలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్ల మైలురాయికి చేరువలో ఉంది.
రెండో రోజు కలెక్షన్స్.. భారీ డ్రాప్

ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకర్ ‘సాక్నిల్క్’ (Sacnilk) రిపోర్టు ప్రకారం.. రెండో రోజు (శనివారం) ‘రాజా సాబ్’ ఇండియాలో రూ. 27.83 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తొలి రోజుతో పోలిస్తే ఇది దాదాపు 48.22% తక్కువ. అంటే కలెక్షన్స్ సగానికి పడిపోయాయి.
తెలుగు: రూ. 22.38 కోట్లు
హిందీ: రూ. 5.2 కోట్లు
తమిళం: రూ. 0.15 కోట్లు
జనవరి 9న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ నడుమ తొలి రోజు రూ. 53.75 కోట్లు రాబట్టిన విషయం తెలిసిందే. రెండు రోజులు కలిపి ఇండియాలో ఈ సినిమా రూ. 81.58 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, గ్రాస్ వసూళ్లు రూ. 108.4 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చిన రూ. 30 కోట్లు కలుపుకుంటే.. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ‘రాజా సాబ్’ రూ. 138.4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోనే హవా.. నార్త్‌లో డల్
రెండో రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ 44 శాతంగా నమోదైంది. ఉదయం షోలకు 29 శాతం ఉన్న ఆదరణ, రాత్రి షోల సమయానికి 51 శాతానికి పెరిగింది. హైదరాబాద్‌లో ఏకంగా 1,159 షోలు ప్రదర్శితమవ్వగా, బెంగళూరులో 653 షోలు పడ్డాయి. విజయవాడ, వైజాగ్, గుంటూరులోనూ ఆదరణ బాగుంది.
అయితే హిందీ వెర్షన్ మాత్రం డీలా పడింది. రెండో రోజు కేవలం 12.95% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో ఎక్కువ షోలు ఉన్నప్పటికీ జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. తమిళంలోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది (21% ఆక్యుపెన్సీ). చెన్నైలో మాత్రం పర్వాలేదనిపించింది.
కొత్త వెర్షన్ వస్తోంది.. ఫ్యాన్స్‌కు పండగే
{{/usCountry}}అయితే హిందీ వెర్షన్ మాత్రం డీలా పడింది. రెండో రోజు కేవలం 12.95% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో ఎక్కువ షోలు ఉన్నప్పటికీ జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. తమిళంలోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది (21% ఆక్యుపెన్సీ). చెన్నైలో మాత్రం పర్వాలేదనిపించింది.
కొత్త వెర్షన్ వస్తోంది.. ఫ్యాన్స్‌కు పండగే
{{/usCountry}}సినిమాలోని వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యత, రన్-టైమ్ విషయంలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో కనిపించిన కొన్ని హైలైట్ సీన్లు సినిమాలో లేకపోవడం ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనిపై స్పందించిన చిత్ర బృందం శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. "అభిమానుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, నిన్న సాయంత్రం కూర్చొని సెకండ్ హాఫ్‌ను మరింత షార్ప్‌గా ఎడిట్ చేశాం. అలాగే మిస్ అయిన సీన్లను శనివారం సాయంత్రం 6 గంటల షో నుంచి కలుపుతున్నాం. సుమారు 8-9 నిమిషాల నిడివి గల ఈ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి పైకప్పు మీద జరిగే ఫైట్ సీన్ ఇప్పటివరకు ఏ సినిమాలోనూ రాలేదు. దీనికోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు" అని వివరించాడు. ఈ కొత్త సీన్లతో సినిమా ఆదరణ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు.