ప్రభాస్, మారుతి మధ్య ఎంతటి బలమైన అనుబంధం ఉందో ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్పష్టమైంది. ఈ ఈవెంట్లో ప్రభాస్ తన ఎదురుగా కూర్చొన్నప్పుడు మారుతి మాట్లాడలేక పదే పదే ఏడ్చేశాడు. ఈ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
మారుతి ఎమోషనల్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఒక ఎమోషనల్ సంఘటన చోటు చేసుకుంది. సినిమా గురించి, ప్రభాస్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ మారుతి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన వెంటనే ప్రభాస్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
ఈవెంట్‌లో మైక్ అందుకున్న మారుతి.. గత మూడేళ్లుగా తాను పడుతున్న ఆవేదనను బయటపెట్టాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి తనపై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్, నెగెటివిటీని తలుచుకుని అతడు ఎమోషనల్ అయ్యాడు.
"ప్రభాస్ గారితో సినిమా అనగానే చాలామంది నన్ను తిట్టారు. ఆయన రేంజ్ ఏంటి? నీ రేంజ్ ఏంటి? అని కామెంట్స్ చేశారు. మూడేళ్లుగా ఈ మాటలన్నీ భరిస్తూ వచ్చాను. కానీ ప్రభాస్ గారు నన్ను నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపాను" అని చెబుతూ మారుతి గద్గద స్వరంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న నిర్మాత ఎస్‌కేఎన్ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసినా మారుతి కంట్రోల్ కాలేకపోయాడు.
ప్రభాస్ రియాక్షన్ ఇలా..
మారుతి తన స్పీచ్ కొనసాగించలేక పదే పదే ఏడుస్తూ ఉన్నాడు. అది గమనించిన ప్రభాస్.. వెంటనే సీట్లో నుంచి లేచి స్టేజ్ మీదకు పరుగెత్తుకెళ్లాడు. మారుతిని గట్టిగా హత్తుకుని, భుజం తట్టి ఓదార్చాడు. "ఇది మూడేళ్ల కష్టం.. ఇప్పుడు బయటకు వస్తోంది" అంటూ మారుతికి ధైర్యం చెప్పాడు. ప్రభాస్ అలా పరుగెత్తుకెళ్లి తన డైరెక్టర్‌కి సపోర్ట్ ఇచ్చిన తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గ్రౌండ్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.
మారుతి ఓపెన్ ఛాలెంజ్
సినిమా అవుట్‌పుట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని మారుతి చెప్పాడు. "సినిమా చూశాక ఏ ఒక్క అభిమాని అయినా నిరాశ చెందితే.. నేరుగా మా ఇంటికి వచ్చి నన్ను నిలదీయండి" అంటూ ఏకంగా తన ఇంటి అడ్రస్ (కొండాపూర్‌లోని విల్లా నంబర్ 16) మైక్‌లో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
{{/usCountry}}సినిమా అవుట్‌పుట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని మారుతి చెప్పాడు. "సినిమా చూశాక ఏ ఒక్క అభిమాని అయినా నిరాశ చెందితే.. నేరుగా మా ఇంటికి వచ్చి నన్ను నిలదీయండి" అంటూ ఏకంగా తన ఇంటి అడ్రస్ (కొండాపూర్‌లోని విల్లా నంబర్ 16) మైక్‌లో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
{{/usCountry}}మూడేళ్ల పాటు తన ప్రాణం పెట్టి ఈ సినిమా తీశానని, ప్రభాస్ కు రుణ పడి ఉంటానని, ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదని ప్రభాస్ గురించి, మూవీ గురించి మారుతి తెలిపాడు.
"నా కెరీర్లో ఫ్లాప్స్ ఉన్న టైంలో కూడా ప్రభాస్ గారు కథను మాత్రమే నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే" అని మారుతి కొనియాడాడు.
ఈ సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో, వింటేజ్ స్టైల్ ఎంటర్‌టైనర్‌గా చూస్తారని, ఫ్యాన్స్‌కి ఇది పండగలా ఉంటుందని హామీ ఇచ్చాడు. ది రాజా సాబ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే రెండు వారాల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం, దానికి డార్లింగ్ ప్రభాస్ రావడంతో మూవీకి మంచి బూస్టప్ లభించింది.