రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab) సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేషన్ పూర్తయ్యింది. కొన్ని కీలకమైన కట్స్, మార్పుల తర్వాత సినిమాకు యూఏ 16+ సర్టిఫికెట్ జారీ చేశారు.
ది రాజా సాబ్ రన్ టైమ్, సెన్సార్ కట్స్ ఇలా..

మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా రన్ టైమ్ విషయంలో మారుతి ఏమాత్రం కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదు.
ది రాజా సాబ్ సినిమా మొత్తం నిడివి 189 నిమిషాలు.. అంటే 3 గంటల 9 నిమిషాలు కావడం గమనార్హం. హారర్ కామెడీకి ఇది చాలా పెద్ద రన్‌టైమ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నుంచి రెండు కీలకమైన కట్స్ సూచించారు.
ఇందులో నేలపై రక్తాన్ని కడిగేసే 35 సెకన్ల విజువల్స్ మరీ వయొలెంట్ గా ఉండటంతో.. దాన్ని బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చాలని సూచించారు. ఒక తల నరికే 4 సెకన్ల ఫ్లాష్ విజువల్‌ను పూర్తిగా తొలగించమని చెప్పారు. మేకర్స్ ఈ సీన్‌ను తీసేశారు. తన అమ్మమ్మను కాపాడుకోవడం కోసం ఒక దుష్ట ఆత్మతో పోరాడే మనవడి కథే ఈ ది రాజాా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కూడా నటించారు.
సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ఇలా..
2026 సంక్రాంతికి థియేటర్ల వద్ద గట్టి పోటీ ఉంది. 'ది రాజా సాబ్'తో పాటు బరిలో ఉన్న సినిమాలు ఏవి, ఎప్పుడు రిలీజ్ కానున్నాయో చూడండి.
{{/usCountry}}2026 సంక్రాంతికి థియేటర్ల వద్ద గట్టి పోటీ ఉంది. 'ది రాజా సాబ్'తో పాటు బరిలో ఉన్న సినిమాలు ఏవి, ఎప్పుడు రిలీజ్ కానున్నాయో చూడండి.
{{/usCountry}}జనవరి 9: విజయ్ చివరి మూవీ 'జన నాయకుడు' (తమిళంలో జన నాయగన్)
జనవరి 10: శివకార్తికేయన్ ‘పరాశక్తి’
జనవరి 12: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’
జనవరి 14: నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’.