ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ టికెట్ల ధరల పెంపు సాధారణం కంటే కూడా చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. అవి ఎలా ఉన్నాయో చూడండి.
ది రాజా సాబ్ టికెట్ల ధరలు

ది రాజా సాబ్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం (జనవరి 7) సాయంత్రం జీవో జారీ చేసింది. దీని ప్రకారం స్పెషల్ షోలకు ఏకంగా రూ.1000గా టికెట్ ధరను నిర్ణయించడం విశేషం. అంతేకాదు తొలి పది రోజుల పాటు రోజుకు ఐదు షోలతోపాటు టికెట్ల ధరలను పెంచుకోవడానికీ అనుమతి ఇచ్చారు.
ఈ జీవో ప్రకారం ఈ పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ అయితే ఒక్కో టికెట్ పై రూ.150, మల్టీప్లెక్స్ అయితే రూ.200 పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. దీంతో టికెట్ల ధర సింగిల్ స్క్రీన్లలో రూ.297, మల్టీప్లెక్స్ లలో రూ.377కు చేరింది. ఇంత భారీగా ధరల పెంపు నేపథ్యంలో ప్రభాస్ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.
ది రాజా సాబ్ మూవీ విశేషాలు
ది రాజా సాబ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో మొదటిది. ప్రభాస్ చాలా రోజుల తర్వాత తన పాత స్టైల్లో కామెడీ పాత్రను పోషించిన మూవీ. జనవరి 9న రిలీజ్ కాబోతోంది. మారుతి డైరెక్షన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ కామెడీ మూవీగా చెబుతూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ప్రభాస్ భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ తోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా నటించారు. సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంతకంటే భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సంక్రాంతికి ప్రభాస్ తొలి హిట్ కొడతాడేమో చూడాలి. దీని తర్వాత మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజులాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.
{{/usCountry}}పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ తోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా నటించారు. సంజయ్ దత్ విలన్ పాత్ర పోషించాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంతకంటే భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సంక్రాంతికి ప్రభాస్ తొలి హిట్ కొడతాడేమో చూడాలి. దీని తర్వాత మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజులాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి.
{{/usCountry}}