The Red Bag Director Ravi Kumar Seerapu Next Movie: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలకు, వినూత్న మేకింగ్ స్టైల్‌కు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఇటీవల కాలంలో థ్రిల్లర్ జోనర్ సినిమాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కిన చిత్రం 'ది రెడ్ బ్యాగ్'.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ది రెడ్ బ్యాగ్

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ది రెడ్ బ్యాగ్ ఆగస్ట్ 21న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ది రెడ్ బ్యాగ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర వహించిన దర్శకుడు రవి కుమార్ సీరపు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.
తొలి యత్నంలోనే నయా ట్రెండ్.. వినూత్న విజువల్ ట్రీట్‌మెంట్!
సాధారణంగా కొత్త దర్శకులు మొదటి సినిమా అనగానే పరిమిత బడ్జెట్ లేదా సేఫ్ జోన్ కథలను ఎంచుకుంటారు. అయితే రవి కుమార్ సీరపు మాత్రం అలా కాకుండా ఒక వైవిధ్యమైన కంటెంట్‌ను నమ్ముకున్నారు. సస్పెన్స్ ఎలిమెంట్స్‌కు ఎమోషన్, మంచి సందేశాన్ని జోడించి కథను నడిపించిన తీరు ఆయనలోని పక్కా విజన్‌ను చాటిచెప్పింది.
ది రెడ్ బ్యాగ్ ప్లస్ పాయింట్
ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దిన తీరు, విజువల్స్, షాట్ డివిజన్ చూస్తే అనుభవజ్ఞుడైన దర్శకుడు తీసినట్లే అనిపిస్తుంది. కంటెంట్‌ను కాపాడుకుంటూనే కమర్షియల్ అంశాలను సరిగ్గా మేళవించడం ది రెడ్ బ్యాగ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద ప్రశంసల వర్షం..
చిత్ర పరిశ్రమలో తొలి అడుగుతోనే గుర్తింపు తెచ్చుకోవడం సులభం కాదు. విమర్శకుల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ప్రశంసలు అందుకోవడం ద్వారా రవి కుమార్ సీరపు తన దర్శకత్వ ముద్రను బలంగా వేసుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మేకింగ్, క్రాఫ్ట్‌ను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.
తదుపరి లక్ష్యం.. మరింత పెద్ద కాన్వాస్!
{{/usCountry}}చిత్ర పరిశ్రమలో తొలి అడుగుతోనే గుర్తింపు తెచ్చుకోవడం సులభం కాదు. విమర్శకుల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ప్రశంసలు అందుకోవడం ద్వారా రవి కుమార్ సీరపు తన దర్శకత్వ ముద్రను బలంగా వేసుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మేకింగ్, క్రాఫ్ట్‌ను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.
తదుపరి లక్ష్యం.. మరింత పెద్ద కాన్వాస్!
{{/usCountry}}"టాలీవుడ్‌కు ఒక ప్రతిభావంతుడైన కొత్త దర్శకుడు లభించాడు" అని పలువురు సినీ ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. 'ది రెడ్ బ్యాగ్'తో లభించిన విజయోత్సాహంతో రవి కుమార్ సీరపు తన తదుపరి ప్రయాణానికి బలమైన పునాది వేసుకున్నారు.
ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో?
ది రెడ్ బ్యాగ్ సినిమాతో తొలి ప్రయత్నంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ఈ యువ దర్శకుడు, రాబోయే రోజుల్లో మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి భారీ కాన్వాస్‌తో, మరింత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తొలి అడుగుతోనే చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన రవి కుమార్ రాబోయే సినిమా ఎలాంటి మ్యాజిక్ చేయబోతోందో వేచి చూడాలి.