తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 42వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఇందులో మరోసారి కార్తీకదీపం 2 సీరియల్ తన తొలి స్థానాన్ని నిలుపుకుంది. అంతేకాదు మొత్తంగా టాప్ 10లో ఆరు స్టార్ మా, నాలుగు జీ తెలుగు ఛానెల్ కు చెందిన సీరియల్స్ ఉన్నాయి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా సీరియల్స్ మరోసారి సత్తా చాటాయి. ఈ ఏడాది 42వ వారం టీఆర్పీ రేటింగ్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. అందులో కార్తీకదీపం 2 సీరియల్ తొలి స్థానంలో ఉంది. ఈ సీరియల్ రేటింగ్ తగ్గినా.. టాప్ లోనే ఉంది. ఈవారం ఈ సీరియల్ కు 13.99 రేటింగ్ నమోదైంది. గతవారం ఇది 14.90గా ఉండేది. ఈ సీరియల్ ఈ మధ్యే 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది.
ఈ సీరియల్ కు 13.47 రేటింగ్ వచ్చింది. ఈ సీరియల్ ఈ మధ్యే 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మూడో స్థానంలోకి మరోసారి గుండె నిండా గుడి గంటలు వచ్చి చేరింది. ఈ సీరియల్ కు 12.06 రేటింగ్ నమోదైంది. ఇంటింటి రామాయణం నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ కు 42వ వారం 11.40 రేటింగ్ వచ్చింది. ఇక ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ కు 10.89 రేటింగ్ నమోదైంది. ఇక నిండు మనసులు సీరియల్ ఆరు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ కు 8.14 రేటింగ్ వచ్చింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే టాప్ 10లో నాలుగు చోటు సంపాదించాయి. తాజాగా ఆరో స్థానానికి ఈ ఛానెల్ కు చెందిన మేఘ సందేశం వచ్చి చేరింది. ఈ సీరియల్ కు 8.40 రేటింగ్ నమోదైంది. ఇక ఎనిమిదో స్థానంలో లక్ష్మీనివాసం ఉంది.
{{/usCountry}}ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే టాప్ 10లో నాలుగు చోటు సంపాదించాయి. తాజాగా ఆరో స్థానానికి ఈ ఛానెల్ కు చెందిన మేఘ సందేశం వచ్చి చేరింది. ఈ సీరియల్ కు 8.40 రేటింగ్ నమోదైంది. ఇక ఎనిమిదో స్థానంలో లక్ష్మీనివాసం ఉంది.
{{/usCountry}}దీనికి 7.74 రేటింగ్ రాగా.. 9వ స్థానంలో ఉన్న చామంతి సీరియల్ కు 7.54, పదో స్థానంలో ఉన్న జగద్ధాత్రికి 7.47 రేటింగ్స్ నమోదయ్యాయి. మరో టాప్ సీరియల్ జయం టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది. దీనికి 7.26 రేటింగ్ వచ్చింది.