...
...
Next Story

Bharat Darshan: నా సీన్లు కాపీ కొట్టి సంక్రాంతికి వచ్చిన హిట్ సినిమాలో పెట్టారు.. డైరెక్టరే కాదు హీరో కూడా అంతే: భరత్

Bharat Darshan: తిరువీర్ నటించిన ఓ సుకుమారి మూవీ డైరెక్టర్ భరత్ దర్శన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చిన హిట్ మూవీలోని సీన్లు కాపీ కొట్టారని, డైరెక్టర్, హీరో ఇద్దరూ అంతే అని అనడం గమనార్హం.

Published on: Jul 8, 2026, 19:13:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Bharat Darshan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ కథల చోరీ వివాదం ముదిరిపోయింది. తాజాగా 2026 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఒక స్టార్ హీరో సినిమా తన కథే అంటూ అప్ కమింగ్ మూవీ 'ఓ సుకుమారి' (Oh..! Sukumari) డైరెక్టర్ భరత్ దర్శన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే ఈ కాపీ రచ్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Bharat Darshan: నా సీన్లు కాపీ కొట్టి సంక్రాంతికి వచ్చిన హిట్ సినిమాలో పెట్టారు.. డైరెక్టరే కాదు హీరో కూడా అంతే: భరత్
Bharat Darshan: నా సీన్లు కాపీ కొట్టి సంక్రాంతికి వచ్చిన హిట్ సినిమాలో పెట్టారు.. డైరెక్టరే కాదు హీరో కూడా అంతే: భరత్

విలక్షణ నటుడు తిరువీర్, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో వస్తున్న పక్కా రూరల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఓ సుకుమారి'. డెబ్యూ డైరెక్టర్ భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 17న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.

నమ్మి కథ చెబితే నా సినిమానే కాపీ కొట్టారు

తాజాగా ఓ సుకుమారి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఐడిల్ బ్రెయిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ భరత్ దర్శన్ మాట్లాడుతూ.. తన సినిమా షూటింగ్ టైమ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. "ఇండస్ట్రీలో నేను అన్న అని పిలిచే ఒక డైరెక్టర్ కి నా స్టోరీ లైన్ మొత్తం చెప్పాను. కానీ 2026 సంక్రాంతికి వచ్చిన ఒక హిట్ సినిమాలో నా సీన్స్ అన్నీ సేమ్ టు సేమ్ దింపేయడం చూసి షాక్ అయ్యాను" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ సంక్రాంతి సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్ లో ఆ 'అన్న' పేరును స్పెషల్ థాంక్స్ కార్డులో కూడా వేశారని భరత్ చెప్పుకొచ్చాడు. అప్పటికే తన ఓ సుకుమారి సినిమా షూటింగ్ 50 శాతం కంప్లీట్ అయిపోయిందని, మెయిన్ పాయింట్స్ అన్నీ ఆ హిట్ సినిమాలో ఉండటం చూసి తట్టుకోలేకపోయానని ఆయన ఎమోషనల్ అయ్యాడు.

హీరో కూడా తక్కువేం కాదు.. వన్ లైనర్స్ లేపేశారు

ఆ కాపీ దెబ్బతో భయపడిపోయిన తాను.. వెంటనే తన ప్రొడ్యూసర్ ను రిక్వెస్ట్ చేసి మళ్ళీ సీన్స్ అన్నీ రీరైట్ చేసుకున్నానని భరత్ చెప్పాడు. ముఖ్యంగా ఓ సుకుమారి సినిమాలోని హీరో క్యారెక్టర్ ఆర్క్, క్లైమాక్స్ మొత్తం మార్చేయాల్సి వచ్చిందని తన కష్టాన్ని పంచుకున్నాడు.

ఫ్యాన్స్ మధ్య మొదలైన కొత్త డిస్కషన్

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే యంగ్ ఫిలిం మేకర్స్ చాలా అమాయకంగా ఉంటారని, ఎవరికి పడితే వాళ్ళకి కథలు చెప్పి మోసపోవద్దని భరత్ వార్నింగ్ ఇచ్చాడు. తమ స్క్రిప్ట్ లకు తామే సొంత హక్కుదారులని, కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కొత్త డైరెక్టర్లకు సూచించాడు. ఎవరో పెద్ద హీరో పిలిచాడు కదా అని వెళ్లి స్టోరీలు చెప్పేయొద్దని, ఏదైనా ఎన్‌డీఏ (నాన్ డిస్‌క్లోజర్ అగ్రీమెంట్)లపై సంతకాలు చేస్తేనే చెప్పాలని చెప్పాడు.

డైరెక్టర్ భరత్ దర్శన్ ఆ సంక్రాంతి సినిమా ఏదో, ఆ హీరో పేరు ఏంటో డైరెక్ట్ గా బయటపెట్టకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆ హిట్ సినిమా ఏదనే దానిపై నెటిజన్లు పెద్ద చర్చ మొదలుపెట్టారు. ఇకపోతే మసూద, పరేషాన్ లాంటి సినిమాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తిరువీర్.. అటు రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్ తో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఐశ్వర్య రాజేష్ కాంబో కావడంతో 'ఓ సుకుమారి' పై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe