OTT Release: ఓటీటీలో బ్లాక్ బస్టర్ వీక్-ఈ వారం తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే-తెలుగు సూపర్ హిట్-ఆ మలయాళం థ్రిల్లర్లు!

OTT Release: కొత్త వారం వచ్చేసింది.. ఓటీటీలో సరికొత్త సందడి తెచ్చేసింది. ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఓటీటీలోకి క్రేజీ సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. ఇందులో కొన్ని స్పెషల్ గా ఉన్నాయి. మరి ఈ కొత్త రిలీజ్ లు ఏంటీ? ఏ ఓటీటీలోకి వస్తున్నాయో ఓ లుక్కేయండి.

Published on: Aug 3, 2026, 10:32:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ.. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త వారం సరికొత్త సినిమాలతో వచ్చేసింది. ఈ వారం తెలుగు డిజిటల్ ప్రియులకు ఓటీటీ స్పేస్‌లో వినోదానికి కొదవలేకుండా పోయింది. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన ఈ స్పెషల్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీలో బ్లాక్ బస్టర్ వీక్-ఈ వారం తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే-తెలుగు సూపర్ హిట్-ఆ మలయాళం థ్రిల్లర్లు!
ఓటీటీలో బ్లాక్ బస్టర్ వీక్-ఈ వారం తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే-తెలుగు సూపర్ హిట్-ఆ మలయాళం థ్రిల్లర్లు!

ఉయిర్ (Uyir)

స్ట్రీమింగ్ వేదిక: జియోహాట్‌స్టార్ (JioHotstar)

భాషలు: మలయాళం (ఓరిజినల్), తెలుగు, తమిళం, కన్నడ, హిందీ

ప్రత్యేకత: మలయాళంలో మంచి ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. సాధారణంగా మలయాళం క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంటుంది. ఈ ఉయిర్ కూడా అలాంటి సినిమానే. ఈ చిత్రానికి కథను రియల్ పోలీస్ ఆఫీసర్ అందించడం విశేషం. ఈ సూపర్ హిట్ మూవీ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

వదంతి: సీజన్ 2 (Vadhandhi Season 2)

స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)

భాషలు: తమిళం (ఒరిజినల్), తెలుగు, హిందీ

ప్రత్యేకత: మొదటి సీజన్‌తో సంచలన విజయం సాధించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రైమ్ వీడియోలో క్రైమ్ జానర్‌ను ఇష్టపడే వీక్షకులకు ఇది పర్ఫెక్ట్ బింజ్-వాచ్. ఆగస్టు 7న ఇది రిలీజ్ కానుంది.

ఆపరేషన్ సఫేద్ సాగర్ (Operation Safed Sagar)

స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

భాషలు: హిందీ (ఒరిజినల్), తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం

ప్రత్యేకత: కార్గిల్ యుద్ధంలో (Kargil War) భారత వైమానిక దళం (Indian Air Force) వహించిన కీలక పాత్ర ఆధారంగా తెరకెక్కిన అన్‌టోల్డ్ వార్ డ్రామా సిరీస్ ఇది. అత్యున్నత నిర్మాణ విలువలతో నెట్‌ఫ్లిక్స్ దీనిని తీర్చిదిద్దింది. ఆగస్టు 7న ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

ఇదయం మురళి (Idhyam Murali)

స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

భాషలు: తమిళం (ఒరిజినల్), తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ

ప్రత్యేకత: యంగ్ హీరో అథర్వ, ఫహద్ ఫాజిల్ (స్పెషల్ కేమియో), మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు నటించిన ఫీల్-గుడ్ అండ్ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా ఇది. ఆగస్టు 7న ఓటీటీ డెబ్యూ చేయనుంది.

లెనిన్ (Lenin)

స్ట్రీమింగ్ వేదిక: జీ5 (ZEE5)

భాషలు: తెలుగు

ప్రత్యేకత: అక్కినేని అఖిల్ కు కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ లెనిన్. ఈ రా అండ్ రస్టిక్ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది.

నూరు సామి (Nooru Saami)

స్ట్రీమింగ్ వేదిక: జీ5 (ZEE5)

భాషలు: తమిళం (ఒరిజినల్), తెలుగు, కన్నడ, మలయాళం

ప్రత్యేకత: యాక్షన్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ తమిళ చిత్రం దక్షిణాది భాషలన్నింటిలోనూ అలరించనుంది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా ఇది. ఆగస్టు 7న ఓటీటీ స్ట్రీమింగ్ షురూ అవుతుంది.

ది సూపర్‌మారియో గెలాక్సీ మూవీ (The Super Mario Galaxy Movie)

స్ట్రీమింగ్ వేదిక: జియోహాట్‌స్టార్ (JioHotstar)

భాషలు: ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ

ప్రత్యేకత: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ యానిమేషన్ అడ్వెంచర్ మూవీ కిడ్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఐ-ఫీస్ట్ ఇవ్వనుంది. ఆగస్టు 7న ఓటీటీ లవర్స్ ముందుకు రాబోతుంది.

కాట్టాలన్ (Kattalan)

స్ట్రీమింగ్ వేదిక: మనోరమా మ్యాక్స్ (ManoramaMax)

భాషలు: మలయాళం

ప్రత్యేకత: మలయాళ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్లను ఆదరించే వారి కోసం ఈ చిత్రం అందుబాటులోకి వస్తోంది. ఇది కూడా ఆగస్టు 7న రిలీజ్ అవుతుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More