Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లెనిన్.. అఖిల్ ఫస్ట్ రూ.100 కోట్ల సినిమా.. ఎప్పుడు చూడాలంటే? మూవీ సక్సెస్ కారణాలు ఇవే!
Lenin OTT: 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత అక్కినేని అఖిల్ నటించిన రస్టిక్ రాయలసీమ యాక్షన్ డ్రామా 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అఖిల్ కెరీర్‌లోనే తొలిసారిగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ సక్సెస్ కారణాలు ఏంటో చూసేయండి.
Lenin OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni)కు బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సినిమా 'లెనిన్' (Lenin). 'ఏజెంట్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో.. పూర్తిగా తన ఇమేజ్‌ను మార్చుకుని చేసిన ఈ రాయలసీమ రూరల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయఢంకా మోగించింది. ఇప్పుడు మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

లెనిన్ రూ.100 కోట్లు
అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. లెనిన్ మూవీతో కెరీర్ లో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. అఖిల్ సినీ ప్రస్థానంలోనే తొలిసారిగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును ( ₹100 Cr Club) దాటిన చిత్రంగా లెనిన్ నిలిచింది. ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు, అక్కినేని అభిమానులకు ఈ మూవీ అదిరిపోయే జోష్ ఇచ్చింది.
లెనిన్ ఓటీటీ రిలీజ్ డేట్
థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ ముగించుకున్న 'లెనిన్' చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్ర డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకుంది. ఆగస్టు 7 నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా అందుబాటులోకి తేనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
థియేటర్లలో సాధించిన సంచలన విజయం దృష్ట్యా, ఓటీటీలోనూ అక్కినేని అఖిల్ సినిమా భారీ వ్యూయర్‌షిప్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.
లెనిన్ ఎందుకు వర్కవుట్ అయింది?
ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం.. అర్బన్ మోడర్న్ లుక్స్ నుంచి పూర్తిగా తప్పుకుని అఖిల్ ఊరమాస్ అవతారంలోకి మారడమే ఈ సినిమా సాధించిన పెద్ద విజయం.
స్టైలిష్ అండ్ అర్బన్ లుక్స్ కన్నా.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ‘కథలో ఉండే మట్టి వాసన’, 'ఇంటెన్స్ ఎమోషన్' త్వరగా కనెక్ట్ అవుతాయి. 'ఏజెంట్' సినిమాలో మితిమీరిన హాలీవుడ్ శైలి యాక్షన్ విఫలమవ్వగా, 'లెనిన్'లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్, నేటివిటీ, సెంటిమెంట్ తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అఖిల్‌కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తెచ్చిపెట్టాయి."
నాగార్జున ప్రొడ్యూసర్ గా
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ (మనం ఎంటర్‌ప్రైజెస్) బ్యానర్‌పై అక్కినేని నాగార్జున సంయుక్తంగా అత్యంత నిర్మాణ విలువలతో లెనిన్ చిత్రాన్ని నిర్మించారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయికగా నటించగా.. శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరి రావు, సునీల్, రామ్కీ, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
ఓటీటీలో ఎందుకు చూడాలంటే?
రాయలసీమ యాక్షన్ సీన్స్: గ్రామీణ నేపధ్యంలో నడిచే ఇంటెన్స్ పగ, ప్రతీకారాలు, యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ ఇస్తాయి.
భాగ్యశ్రీ - అఖిల్ కెమిస్ట్రీ: సినిమాలో వీరిద్దరి మధ్య నడిచే లవ్ ట్రాక్, తమన్ మెలోడీలు ప్రత్యేక ఆకర్షణ.
సపోర్టింగ్ కాస్ట్ పెర్ఫార్మెన్స్: ప్రమోద్, శివాజీ, ఈశ్వరి రావు పాత్రల ఎమోషనల్ పండించిన తీరు ఓటీటీ వీక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


