OTT: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో సందడి మరో లెవల్ లో ఉంటుంది. ఈ ఫ్రైడే కూడా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు డిఫరెంట్ జోనర్లలో మూవీస్ వచ్చేశాయి. ఇందులో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ‘థ్రాష్’ (Thrash) ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీ స్టోరీ లైన్, నేపథ్యం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది.
థ్రాష్ ఓటీటీ

అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ ‘థ్రాష్’ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (ఏప్రిల్ 10) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోని రిలీజ్ అయింది. ఈ థ్రిల్లర్ తెలుగులోనూ చూసేందుకు అందుబాటులో ఉంది.
ఓటీటీ లవర్స్ కోసం
థ్రాష్ మూవీ ఓటీటీ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ థ్రిల్లర్ మూవీకి టామీ విర్కోలా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఫోబ్ డైనెవోర్, విట్నీ పీక్, హౌన్సు తదితరులు నటించారు. సోనీ పిక్చర్స్, హైపర్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్ ఈ మూవీని నిర్మించాయి.
నిజానికి ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఈ సమయంలోనే నెట్‌ఫ్లిక్స్ మంచి ఆఫర్ ఇవ్వడంతో సోనీ పిక్చర్స్ ఈ థ్రాష్ మూవీ ఓటీటీ రిలీజ్ కు సై అంది.
సర్వైవల్ థ్రిల్లర్
థ్రాష్ సినిమా సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. లిసా ఫీల్డ్స్ ఓ ప్రెగ్నెంట్ లేడీ. ఆమె నెలలు నిండిన గర్భిణి. ఆమె నివసిస్తున్న నగరంలో హరికేన్ (తుఫాను) భారీ భీభత్సం సృష్టిస్తుంది. అప్పటికే అయిదో నంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. అయితే బయటకు వెళ్లిన లిసా తిరిగి ఇంటికి చేరుకునేందుకు కార్లోకి ఎక్కుతుంది.
అప్పుడే తుఫాను తీవ్రత ఎక్కువ అవుతుంది. సముద్రం పోటెత్తుతుంది. దీంతో అలలు తీవ్ర రూపం దాల్చి నగరాన్ని ముంచెత్తుతాయి. ఆ సమయంలో లిసా కారులోనే చిక్కుకుపోతుంది. తన బిడ్డకు జన్మనివ్వడం కోసమైనా ఆమె బతకాలని అనుకుంటుంది. అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన షార్క్ లు నగరంలోకి వస్తాయి. జనాలను అవి వేటాడుతాయి.
{{/usCountry}}అప్పుడే తుఫాను తీవ్రత ఎక్కువ అవుతుంది. సముద్రం పోటెత్తుతుంది. దీంతో అలలు తీవ్ర రూపం దాల్చి నగరాన్ని ముంచెత్తుతాయి. ఆ సమయంలో లిసా కారులోనే చిక్కుకుపోతుంది. తన బిడ్డకు జన్మనివ్వడం కోసమైనా ఆమె బతకాలని అనుకుంటుంది. అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన షార్క్ లు నగరంలోకి వస్తాయి. జనాలను అవి వేటాడుతాయి.
{{/usCountry}}ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే లిసాకు నొప్పులు వస్తాయి. మరి ఆ వరదను దాటి, షార్క్ లను ఎదుర్కొని లిసా బిడ్డకు జన్మనిచ్చిందా? ఆమె ప్రాణాలు నిలబెట్టుకుందా? అన్నది థ్రాష్ సినిమాలో చూడాల్సిందే. ఉత్కంఠ రేపే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లను ఇష్టపడే వాళ్లకు థ్రాష్ మంచి ఆప్షన్.