...
...
Next Story

ఓటీటీలోకి నేరుగా వచ్చిన థ్రిల్లర్ మూవీ.. రెండు హత్యలు.. భార్యపైనే అనుమానం.. సాలీ మొహబ్బత్ ఎలా ఉందంటే?

రాధికా ఆప్టే నటించిన థ్రిల్లర్ మూవీ సాలీ మొహబ్బత్ శుక్రవారం (డిసెంబర్ 12) నేరుగా ఓటీటీలోకి వచ్చింది. రెండు హత్యల చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

Published on: Dec 12, 2025, 16:17:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నటి, దర్శకురాలు టిస్కా చోప్రా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ 'సాలీ మొహబ్బత్' (Saali Mohabbat) ఈరోజు అంటే డిసెంబర్ 12న జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. రాధికా ఆప్టే, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో.. రాధిక నటనకు మంచి మార్కులు పడినా, కథనంలో ఉండాల్సిన ఉత్కంఠ లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టిస్కా చోప్రా తీసిన పాపులర్ షార్ట్ ఫిల్మ్ ‘చట్నీ’ని గుర్తుచేస్తోంది. మరి ఈ 'సాలీ మొహబ్బత్' సినిమా ఎలా ఉంది? థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుందా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

సాలీ మొహబ్బత్ మూవీ కథేంటంటే?

ఓటీటీలోకి నేరుగా వచ్చిన థ్రిల్లర్ మూవీ.. రెండు హత్యలు.. భార్యపైనే అనుమానం.. సాలీ మొహబ్బత్ ఎలా ఉందంటే?
ఓటీటీలోకి నేరుగా వచ్చిన థ్రిల్లర్ మూవీ.. రెండు హత్యలు.. భార్యపైనే అనుమానం.. సాలీ మొహబ్బత్ ఎలా ఉందంటే?

జీ5 ఓటీటీలోకి నేరుగా వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ సాలీ మొహబ్బత్. ఈ సినిమా స్మిత (రాధికా ఆప్టే) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. తన భర్త పంకజ్ (అన్షుమాన్ పుష్కర్) చేతిలో మోసపోయిన ఆమె అతన్నే హత్య చేసిన కేసులో ఎలా అనుమానితురాలు అవుతుందన్నది ఇందులో చూడొచ్చు.

భర్త తన కజిన్ షాలిని (సౌరసేని మైత్రా)తో వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు. ఒకరోజు ఆ ఇద్దరూ (భర్త, కజిన్) శవాలుగా దొరుకుతారు. ఈ జంట హత్యల కేసును విచారించడానికి అవినీతిపరుడైన పోలీస్ రతన్ (దివ్యేందు) రంగంలోకి దిగుతాడు. ఇంతకీ వాళ్లను ఎవరు చంపారు? అసలు దోషి ఎవరు? అనేది ఈ సినిమాలో చూడాలి.

సాలీ మొహబ్బత్ ఎలా ఉందంటే?

సాలీ మొహబ్బత్ సినిమాకు రాధికా ఆప్టేనే పెద్ద ప్లాస్ పాయింట్. ఏ పాత్రలో అయినా ఇమిడిపోయే ఆమె ఈ సినిమాలోనూ మోసపోయిన భార్యగా, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళగా అద్భుతంగా నటించింది. ఆమె ఎమోషన్స్ బాగా పండాయి. శరత్ సక్సేనా పాత్ర ఆమెకు సహాయపడే తీరు బాగుంది.

"ఒక స్త్రీకి కోపం వస్తే ఎంత దూరమైనా వెళ్తుంది" అనే పాయింట్‌తో సినిమాను ఆసక్తికరంగానే మొదలుపెట్టారు. ఒక మనిషి సుఖం కోసమే నిర్మించుకున్న పెళ్లి బంధం ఎలా ముక్కలవుతుందో బాగా చూపించారు.

'సాలీ మొహబ్బత్' ఒక మంచి పాయింట్‌తో మొదలైనప్పటికీ, బలమైన గ్రిప్ లేని థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంలో విఫలమైంది. టిస్కా చోప్రా ప్రయత్నం, నటీనటుల నటన బాగున్నా.. కథనంలో పట్టు లేకపోవడం నిరాశపరుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe