OTT Thrillers: అటు మలయాళం, ఇటు తెలుగు.. ఓటీటీలోకి ఒకేరోజు వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లు.. సూప‌ర్ ట్విస్ట్‌లు

OTT Thrillers: ఓటీటీ లవర్స్ కు ట్రీట్. ఒకే రోజు అటు మలయాళం, ఇటు తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఈ రోజే ఓటీటీలో అడుగుపెట్టాయి. వీటిపై ఓ లుక్కేయండి. 

Published on: Feb 27, 2026, 11:29:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్షణక్షణం ఉత్కంఠ పెంచుతూ, సీన్ సీన్ కు థ్రిల్ అందిస్తూ సాగే సినిమాలు, సిరీస్ లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. థ్రిల్లర్లను డిజిటల్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ ఓటీటీ లవర్స్ కు అదిరే ట్రీట్ అందించడానికి ఒకే రోజు అటు మలయాళం, ఇటు తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు వచ్చేశాయి.

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్లు
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్లు

డాటర్ ఆఫ్ ప్రసాద రావు కనబడుటలేదు

రాజీవ్ కనకాల ఓ వైపు సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూనే, ఓటీటీల్లోనూ వచ్చే సిరీస్ ల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ మరోసారి లీడ్ రోల్ ప్లే చేసిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఈ తెలుగు సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇవాళ (ఫిబ్రవరి 27) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తెలుగులో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

కూతురి మిస్సింగ్

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు వెబ్ సిరీస్ ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) కూతురు స్వాతి (వాసంతిక) మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. ప్రసాద్ రావుకు స్వాతి అంటే ప్రాణం.

చిత్తూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రసాద్ రావు ఒక కిరాణా షాపు నడుపుతూ జీవిస్తాడు. స్వాతికి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ వస్తుంది. అక్కడికి వెళ్లిన స్వాతి మిస్ అవుతుంది. ఈ కేసును రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను) ఇన్విస్టిగేట్ చేస్తుంది.

రోజ్లిన్

ఇవాళ ఓటీటీలోకి వచ్చి మరో మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘రోజ్లిన్’. మలయాళ థ్రిల్లర్లు అంటే ఉండే క్రేజే వేరు. అలాంటిది దృశ్యం లాంటి టాప్ థ్రిల్లర్ ను అందించిన జీతు జోసెఫ్ సమర్పించిన రోజ్లిన్ సిరీస్ ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అంచనాలకు తగ్గట్లుగానే ఈ సిరీస్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. జియోహాట్ స్టార్ లో ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మర్డర్ మిస్టరీ

రోజ్లిన్ సిరీస్ లో సీనియర్ నటి మీనా లీడ్ రోల్ ప్లే చేసింది. రోజ్లిన్ (మీనా) ఓ హౌస్ వైఫ్. ఆమె భర్త ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. మర్డర్ కేసుతో వీళ్ల లైఫ్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. రోజ్లిన్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. మరి నిజంగానే రోజ్లిన్ ఆ హత్య చేసిందా? అసలు ఏమైంది? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More