Gopichand: మళ్లీ విలన్‌గా స్టార్ హీరో గోపీచంద్.. ఈసారి తమిళంలో.. ఇండస్ట్రీలో క్రేజీ బజ్
Gopichand: టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ మరోసారి విలన్ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తెలుగులో కాకుండా తమిళంలో స్టార్ హీరో అయిన సూర్య మూవీలో అతడు నటించబోతుండటం విశేషం.
Gopichand: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) 2026 సంవత్సరంలో వరుసగా మూడు భారీ విజయాలతో (హ్యాట్రిక్ హిట్స్) బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. ఇటీవలే విడుదలైన 'సీన్' (Scene) సంచలన విజయం తర్వాత ఏమాత్రం విరామం తీసుకోకుండా, 'జై భీమ్' ఫేమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో కలిసి జపాన్‌లో తన తదుపరి చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగానే, సూర్య చేయబోయే మరో క్రేజీ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన బజ్ నడుస్తోంది.

'డీసీ' (DC) ఫేమ్ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సూర్య నటించబోయే భారీ యాక్షన్ చిత్రంలో, టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ విలన్ గా నటించనున్నారని సమాచారం. అదే నిజమైతే గోపీచంద్‌కు ఇదే తొలి తమిళ చిత్రం కానుంది.
సూర్య వర్సెస్ గోపీచంద్
తెలుగు సినీ పరిశ్రమలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్, కెరీర్ ఆరంభంలో విలన్‌గా తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో ఆయన పోషించిన విలన్ పాత్రలు ఇప్పటికీ టాలీవుడ్ చరిత్రలో ఐకానిక్‌గా నిలిచిపోయాయి.
ఇండస్ట్రీ వర్గాల తాజా కథనాల ప్రకారం, అరుణ్ మాతేశ్వరన్ రూపొందించే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలో సూర్యను ఢీకొట్టే శక్తివంతమైన పాత్ర కోసం గోపీచంద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ ఖరారైతే, తమిళ సినీ పరిశ్రమకు గోపీచంద్ గ్రాండ్‌గా పరిచయమవుతారు.
మరోవైపు గోపీచంద్ తెలుగులో 'భారతవర్ష' (Bharatavarsha) అనే భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో సూర్య లాంటి పాన్-ఇండియా స్టార్ సినిమాలో కీలక పాత్ర చేయడం ఆయన మార్కెట్‌ను దక్షిణాది అంతటా మరింత విస్తరించే అవకాశం ఉంది.
అనిరుధ్ సంగీతం.. ‘సర్వం మాయ’ నటి రియా షిబు ఎంట్రీ
సూర్య – అరుణ్ మాతేశ్వరన్ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పటికే భారీ సాంకేతిక నిపుణుల బృందం చేరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో అరుణ్ మాతేశ్వరన్తో కలిసి పనిచేసిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని సమాచారం. సూర్య, గోపీచంద్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలకు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
సర్వం మాయ' (Sarvam Maya) చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి రియా షిబు (Riya Shibu) ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించనున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జపాన్‌లో టీజే జ్ఞానవేల్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసిన వెంటనే సూర్య ఈ ప్రాజెక్ట్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జగరం స్టూడియోస్ (Zhagaram Studios) భారీ బడ్జెట్‌తో నిర్మించే అవకాశం ఉంది.
సూర్య లాంటి అద్భుతమైన నటుడికి, గోపీచంద్ లాంటి కటౌట్ ఉన్న విలన్ తోడైతే వెండితెరపై ఆ విజువల్ ట్రీట్ ఏ స్థాయిలో ఉంటుందోనని ఇరు రాష్ట్రాల అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


