Scene OTT Release Date: ముందుగానే ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Scene OTT Release Date: సీన్ మూవీ థియేటర్లలో జోరు కొనసాగుతుండగానే డిజిటల్ వేదికపైకి రావడానికి సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ రూ. 85 కోట్లకు పైగా భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, విడుదలైన 4 వారాలకే అంటే డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Published on: Nov 17, 2026, 16:44:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Scene OTT Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 'ఆవేశం', 'రోమాంచం' చిత్రాల ఫేమ్ మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కించిన ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 6న థియేటర్లలో విడుదలై సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. సాక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, తొలి పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 242.05 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఊహించినదాని కంటే ముందే ఓటీటీలోకి రానుంది.

Scene OTT Release Date: ముందుగానే ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
Scene OTT Release Date: ముందుగానే ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి..

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. 'సీన్' చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 85 కోట్లకు పైగా (కొన్ని రిపోర్టుల ప్రకారం రూ. 88 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య నాలుగు వారాల గ్యాప్ ఉండేలా నిబంధన పెట్టుకున్నారు. నవంబర్ 6న థియేటర్లలో విడుదలైనందున, థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే డిసెంబర్ 4న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టనుంది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కోలీవుడ్‌లో భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలు సైతం 4 వారాల విండోను పాటించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే తమిళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డులు బద్దలు కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' (Jailer 2) చిత్రం కూడా థియేటర్లలో విడుదలైన సరిగ్గా నాలుగు వారాలకు, నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు సూర్య 'సీన్' కూడా అదే బాటలో పయనిస్తోంది.

బాక్సాఫీస్ జోరు vs ఓటీటీ ఎంట్రీ

సాక్నిల్క్ బాక్సాఫీస్ గణాంకాల ప్రకారం.. 'సీన్' మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 242.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ మొత్తం రూ. 247.85 కోట్లకు చేరింది. తొలి 10 రోజుల్లో భారత్‌లో రూ. 158.55 కోట్ల గ్రాస్ రాబట్టగా, విదేశాల్లో ఏకంగా రూ. 83.50 కోట్లు వసూలు చేసి సూర్య కెరీర్‌లోనే ఆల్-టైమ్ ఓవర్సీస్ రికార్డును నెలకొల్పింది.

రెండో వీకెండ్‌లోనూ శనివారం వసూళ్లు భారీగా పుంజుకోవడంతో రూ. 24.80 కోట్ల ఇండియా నెట్ వసూళ్లను జతచేసింది. రెండో వీకెండ్ ముగిసిన కేవలం 19 రోజులకే అంటే డిసెంబర్ 4న ఓటీటీలోకి రావడం వల్ల, థియేట్రికల్ రన్‌కు తక్కువ సమయం మిగులుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల ఆదరణను బట్టి థియేటర్లలో ప్రదర్శన కొనసాగే అవకాశం ఉంది.

‘సీన్’ స్టోరీ ఏంటంటే?

మలయాళంలో 'రోమాంచం', 'ఆవేశం' వంటి కల్ట్ చిత్రాలను అందించిన జిత్తు మాధవన్, తన తొలి తమిళ చిత్రమైన 'సీన్'ను ఒక వైవిధ్యమైన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు.

దీపావళి పండుగ నేపథ్యంలో సాగే ఈ కథలో, లోపాలున్న ఒక పోలీస్ ఆఫీసర్ (డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో సూర్య), విచిత్రమైన మనస్తత్వం కలిగిన ఒక కాంట్రాక్ట్ కిల్లర్ మధ్య జరిగే దొంగాపోలీస్ ఆట ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది.

సూర్య సరసన నజ్రియా నజీమ్, యువ సంచలనం నస్లెన్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు జై, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో మెరిశారు. సుశిన్ శ్యామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

థియేటర్లలో ప్రతి పది నిమిషాలకు విజిల్స్ వేయిస్తున్న సూర్య 'సీన్', త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More