Jagapathi Babu: కిచెన్‌లో జగ్గూ భాయ్.. పెద్ద కూతురితో కలిసి చాక్లెట్ చిప్ కుకీస్.. నా మొహం ఎవరూ పగలగొట్టలేదంటూ..

Jagapathi Babu: జగపతి బాబు తాజాగా షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో తన పెద్ద కూతురితో కలిసి ఆయన చాక్లెట్ చిప్ కుకీస్ తయారు చయడం చూడొచ్చు. ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

Published on: Jul 30, 2026, 16:53:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jagapathi Babu: సిల్వర్ స్క్రీన్ పై రౌద్రం చిందించే పవర్‌ఫుల్ విలన్‌గా, గంభీరమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించే సీనియర్ నటుడు జగపతి బాబు రియల్ లైఫ్‌లో చాలా కూల్‌గా ఉంటారు. తాజాగా తన పెద్ద కుమార్తెతో కలిసి కిచెన్‌లో సరదాగా గడిపిన ఒక క్యూట్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Jagapathi Babu: కిచెన్‌లో జగ్గూ భాయ్.. పెద్ద కూతురితో కలిసి చాక్లెట్ చిప్ కుకీస్.. నా మొహం ఎవరూ పగలగొట్టలేదంటూ..
Jagapathi Babu: కిచెన్‌లో జగ్గూ భాయ్.. పెద్ద కూతురితో కలిసి చాక్లెట్ చిప్ కుకీస్.. నా మొహం ఎవరూ పగలగొట్టలేదంటూ..

జగ్గూ భాయ్ చాక్లెట్ కుకీస్

తన పెద్ద కూతురితో కలిసి చాక్లెట్ చిప్ కుకీస్ (Chocolate Chip Cookies) తయారు చేస్తూ జగ్గుభాయ్ చేసిన అల్లరి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

"మళ్లీ మళ్లీ చెప్తున్నా.. ఇది కూడా మా పెద్ద అమ్మాయి చెప్పినట్టు కాపీ పేస్ట్ చేసేశా!" అంటూ జగపతి బాబు పెట్టిన సరదా క్యాప్షన్ ప్రతీ ఒక్కరినీ నవ్విస్తోంది. కూతురు చెప్పిన ప్రతీ చిన్న సూచనను పాటిస్తూ ఆయన బేకింగ్ చేసిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది.

ఈ వీడియో మొదట్లో జగ్గూ భాయ్ అన్న మాటలు కూడా ఫన్నీగా ఉన్నాయి. తన మొహం చూస్తే ఎవరో పగలగొట్టినట్లుగా ఉంది కానీ ఎవరూ పగలగొట్టలేదంటూ వీడియో మొదలుపెట్టారు.

రీల్ లైఫ్‌లో క్రూరమైన విలన్.. రియల్ లైఫ్‌లో లవింగ్ ఫాదర్

తెరపై 'లెజెండ్' సినిమాలో జితేంద్రగా, 'రంగస్థలం'లో ఫణీంద్ర భూపతిగా, 'సలార్'లో రాజమన్నార్‌గా గంభీరమైన విలనిజం పండించిన జగపతి బాబు.. ఇంట్లో మాత్రం చాలా సరదా మనిషి. ఆయన తన పిల్లల ముందు ఒక నటుడిగా కాకుండా కేవలం ఒక ప్రేమగల తండ్రిగానే ఉంటారు.

ఈ వీడియోలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆనందం చూసిన అభిమానులు "తెరపై అంత భయంకరంగా కనిపించే విలన్, ఇంట్లో ఇంత స్వీట్ నాన్నా!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఫ్యామిలీ ప్రైవసీకి పెద్దపీట.. అరుదైన క్యూట్ మూమెంట్

జగపతి బాబుకు ఇద్దరు కుమార్తెలు కాగా, ఆయన ఎప్పుడూ తన కుటుంబాన్ని సినీ గ్లామర్‌కు, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంచుతారు. తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకోని జగ్గుభాయ్.. ఇలా తన పెద్ద కుమార్తె మేఘనతో కలిసి ఉన్న అరుదైన క్షణాలను షేర్ చేయడంతో ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.

ఈ క్యూట్ బేకింగ్ వీడియోపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు లవ్ ఈమోజీలతో స్పందిస్తూ తమ ప్రేమాభిమానాలను తెలియజేస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాలతో జగ్గుభాయ్ ఫుల్ బిజీ

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌ను ఏలిన జగపతి బాబు.. 'లెజెండ్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈమధ్యే పెద్ది మూవీలో కనిపించారు.

షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికిన సమయంలో కుటుంబంతో కలిసి ఇలాంటి తీపి జ్ఞాపకాలను క్రియేట్ చేసుకుంటూ తన ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More