Srikanth: హీరోగా ఛాన్స్ రావడం లేదు.. లయను చూసి కొత్త హీరోయిన్ అనుకున్నా.. ఈ పాత్ర కోసం ఆయన నాన్ వెజ్ మానేశాడు: శ్రీకాంత్
Srikanth: చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' మూవీ ప్రెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆయన హీరోగా గ్యాప్ రావడానికి కారణాలు, సెట్‌లో హీరోయిన్‌ను చూసి ఎందుకు ఆశ్చర్యపోయారు అనే ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Srikanth: ఫ్యామిలీ ఆడియన్స్‌కు శ్రీకాంత్ అంటే భలే ఇష్టం. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలారు. మధ్యలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తన టాలెంట్ చూపించారు. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆయన మెయిన్ లీడ్‌గా మన ముందుకు వస్తున్నారు. ఆ సినిమా పేరే 'మిస్టర్ మిడిల్ క్లాస్'. రీసెంట్‌గా ఈ మూవీ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో శ్రీకాంత్ మీడియా వాళ్లతో ఎంతో ఓపెన్‌గా ముచ్చటించారు.

లయను చూసి కొత్త హీరోయిన్ అనుకున్నా
ఈ సినిమాలో హీరోయిన్ లయ గురించి చెప్తూ ఆయన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. "సెట్‌లో మొదటిసారి హీరోయిన్ లయని చూడగానే భలే సర్ ప్రైజ్ అయ్యాను. ఒక క్షణం లయ ఏమో అనుకున్నా. లయ మళ్లీ వచ్చిందా? లేక కొత్త హీరోయిన్ అచ్చం లయలా ఉందా అని ఆశ్చర్యపోయాను" అని శ్రీకాంత్ నవ్వుతూ చెప్పారు.
హీరోగా ఛాన్స్ రావడం లేదు
ఇదే ప్రెస్ మీట్‌లో మీడియా వాళ్లు ఆయనను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. 'హీరోగా మీకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? మీరే సినిమాలు చేయలేదా? లేక అవకాశాలు రాలేదా?' అని అడిగితే.. శ్రీకాంత్ ఏమాత్రం ఆలోచించకుండా చాలా ఫ్రాంక్‌గా ఆన్సర్ ఇచ్చారు.
"నిజం చెప్పాలంటే అవకాశాలు రాకపోవడమే మెయిన్ రీజన్. ఇప్పుడు ఇండస్ట్రీకి యంగ్ హీరోలు చాలా మంది వచ్చేశారు కదా.. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే అదే వాస్తవం" అంటూ ఎలాంటి ఇగో లేకుండా చెప్పారు.
ఆ సినిమాలు మిస్ అవుతున్నా
అలాగే పాత తరం డైరెక్టర్ల గురించి కూడా శ్రీకాంత్ మాట్లాడారు. "ఈ జనరేషన్‌లో ఈవీవీ సత్యనారాయణ గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్లు సినిమాలు తీస్తే జనాలు థియేటర్లకు వచ్చి చూస్తారా లేదా అనే డౌట్ చాలా మందిలో ఉండేది. కానీ ఫ్యామిలీ సినిమాలు పక్కాగా చూస్తారని అనిల్ రావిపూడి తన సినిమాలతో ప్రూవ్ చేశాడు" అని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు.
ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ చాలా ఈవెంట్లలో కనిపించారు. కానీ అవన్నీ ఆయన సపోర్టింగ్ రోల్స్ చేసిన సినిమాలే. అదే విషయంపై ఆయన స్పందిస్తూ.. "ఈ మధ్య నేను చాలా సినిమాల ఫంక్షన్స్‌కు గెస్ట్‌గా వచ్చాను. కానీ.. చాలా ఇయర్స్ తర్వాత నా సొంత సినిమా ఫంక్షన్‌కు నేను హీరోగా రావడం చాలా హ్యాపీగా ఉంది" అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
రాజేంద్ర ప్రసాద్ నాన్ వెజ్ మానేశారు
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్.. వెంకటేశ్వర స్వామిగా నటించడంపై కూడా శ్రీకాంత్ స్పందించారు. “వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కోసం రాజేంద్ర ప్రసాద్ గారు నాన్ వెజ్ కూడా పూర్తిగా మానేసి చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం డెడికేటెడ్ వర్కర్స్ లాగా పనిచేసేవాళ్లం. సినిమా మీద ప్యాషన్‌తో కొన్నిసార్లు అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా పని చేసిన రోజులు ఉన్నాయి” ఆయన గుర్తుచేసుకున్నారు. ఏది ఏమైనా 'మిస్టర్ మిడిల్ క్లాస్' సినిమాతో శ్రీకాంత్ మళ్లీ మంచి సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
శ్రీకాంత్ లేటెస్ట్ మూవీ పేరు ఏమిటి?
శ్రీకాంత్ చాలా కాలం తర్వాత హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పేరు 'మిస్టర్ మిడిల్ క్లాస్'.
హీరోగా గ్యాప్ రావడానికి కారణం ఏంటని శ్రీకాంత్ చెప్పారు?
ఇండస్ట్రీలోకి చాలా మంది యంగ్ హీరోలు రావడం వల్ల తనకు హీరోగా అవకాశాలు రాలేదని, అందుకే గ్యాప్ వచ్చిందని ఆయన చాలా ఫ్రాంక్‌గా చెప్పారు.
సెట్‌లో లయను చూసి శ్రీకాంత్ ఎందుకు ఆశ్చర్యపోయారు?
సెట్ లో లయను చూడగానే ఈమె లయనేనా లేక కొత్త హీరోయినా అని అనుకున్నానని శ్రీకాంత్ చెప్పారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


