OTT Telugu: ఓటీటీలోకి మూడు వాారాల్లోనే వస్తున్న శివాజీ, లయ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ
OTT Telugu: శివాజీ, లయ జంటగా నటించిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ సాంప్రదాయిని సుద్దపూసని మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. నిజానికి నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకే వస్తుందనుకున్న ఈ మూవీ.. ఈ నెల మొదట్లో థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే.
తెలుగు క్రైమ్ కామెడీ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఫిబ్రవరి 12న నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ తెలుగు సినిమా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ నటుడు శివాజీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ మెయిన్ లీడ్స్‌గా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ మార్చి 26న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ
నిజానికి ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను ఈటీవీ విన్ కోసం ఒక ఓటీటీ ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా ప్లాన్ చేశారు. కానీ సినిమా అవుట్‌పుట్ చాలా బాగా రావడంతో, మేకర్స్ తమ ప్లాన్ మార్చుకుని మార్చి 6న థియేటర్లలో రిలీజ్ చేశారు.
అక్కడ డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. కరెక్ట్‌గా ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. సుధీర్ శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ ఫన్ అండ్ క్రైమ్ కామెడీలో.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత శివాజీ, లయ జంటగా తెరమీద కనిపించడం అభిమానులకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
కడుపుబ్బా నవ్వించే క్రైమ్ స్టోరీ..
అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. శ్రీరామ్ (శివాజీ) ఒక నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీ. తను భార్య, కొడుకుతో కలిసి చాలా ప్రశాంతంగా జీవితం గడుపుతుంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు వాళ్ల ఇంట్లో విక్రమ్ (ప్రిన్స్) అనే ఒక పోలీస్ ఆఫీసర్ శవమై కనిపిస్తాడు.
అతన్ని తుపాకీతో కాల్చి చంపింది మన కొడుకే అని శ్రీరామ్ భార్య చెబుతుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన శ్రీరామ్, తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆ హత్య తాలూకు ఆధారాలను చెరిపేయడానికి రంగంలోకి దిగుతాడు. ఆ కంగారులో అతను చేసే పనులు, ఆ తర్వాత జరిగే సంఘటనలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.
శివాజీ, లయ యాక్టింగ్ సూపర్..
దర్శకుడిగా పరిచయమవుతున్న సుధీర్ శ్రీరామ్ ఈ కథను చాలా వినోదాత్మకంగా రాసుకున్నాడు. ముఖ్యంగా నిజాయితీపరుడైన ఆఫీసర్‌గా శివాజీ నటన, అలాగే కొంచెం అమాయకంగా, కాస్త తిక్కగా ప్రవర్తించే భార్య పాత్రలో లయ యాక్టింగ్ థియేటర్లలో ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ఎప్పుడూ ఫోన్లో రీల్స్ చూస్తూ కాలం గడిపే కొడుకు పాత్రలో రోహన్ నటించాడు.
ఇటీవల #90's అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శివాజీ, ఆ తర్వాత కోర్ట్, దండోరా లాంటి ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఈ కామెడీ థ్రిల్లర్‌తో మరోసారి మన ముందుకు వస్తున్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


