Brahmanandam: స్టేజీ పైనే శివాజీ కొడుకుకు బ్రహ్మానందం చెంపదెబ్బ.. సినిమా అడ్యాన్స్‌గా గోల్డ్ రింగ్.. వీడియో వైరల్
Brahmanandam: సీనియర్ నటుడు బ్రహ్మానందం చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. స్టేజీ మీదే సీనియర్ హీరో శివాజీ కొడుకును బ్రహ్మానందం చెంపదెబ్బ కొట్టారు. ఆ తర్వాత సినిమా కోసం ఆ కుర్రాడికి తన గోల్డ్ రింగ్ ను బ్రహ్మీ అడ్వాన్స్ గా ఇచ్చాడు.
సినిమాల్లోనే కాదు బయట స్టేజీల మీద కూడా తనదైన స్టైల్లో నవ్వులు పంచుతూనే ఉంటారు బ్రహ్మానందం. నవ్వించడమే ఆయన పని. తాజాగా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మీ చేసిన ఓ పని తెగ వైరల్ గా మారింది. సీనియర్ హీరో శివాజీ కొడుకును స్టేజీపైనే చెంపదెబ్బ కొట్టిన బ్రహ్మానందం, ఆ తర్వాత మూవీ అడ్వాన్స్ గా గోల్డ్ రింగ్ ఇచ్చారు.
శివాజీ కొడుకుతో బ్రహ్మానందం (x)
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని
శివాజీ, లయ లీడ్ రోల్స్ ప్లే చేసిన మూవీ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. మంగళవారం (మార్చి 3) రాత్రి హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బ్రహ్మానందం చీఫ్ గెస్ట్ గా వచ్చారు. స్టేజీపైన స్పీచ్ లో తనదైన స్టైల్లో ఛలోక్తులు విసురుతూ అందరినీ నవ్వించారు. ‘గ్లాస్ లు కడుక్కునే టైమ్ కు ఉపన్యాసం ఎవరైనా వింటారా’ అని ఫన్నీగానే తన స్పీచ్ మొదలెట్టారు.
శివాజీ కొడుకు
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతున్నప్పుడు శివాజీ చిన్నకొడుకు రిక్కీకి స్టేజీపైనే ఉన్నాడు. ‘‘నీ కొడుక్కి అడ్వాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నా’’ అని శివాజీతో బ్రహ్మానందం అన్నాడు. ‘‘మీ ఇష్టం అన్న’’ అని శివాజీ అనడంతో రిక్కీని దగ్గరకు పిలిచారు.
చెంపపై కొట్టి
రిక్కీ దగ్గరకు రాగానే అతని చెంపపై బ్రహ్మానందం కొట్టారు. ‘‘ఫస్ట్ సినిమాకు అడ్వాన్స్ ఇద్దాం’’ అనుకుంటున్నా అని బ్రహ్మీ అన్నారు. అలీ ముందే అడ్వాన్స్ ఇచ్చాడని అక్కడున్నవాళ్లు చెప్పారు. డాలర్ నోట్ ఇక్కడ చెల్లదు ఇక్కడు రూపీస్ ఉండాలని బ్రహ్మీ సరదాగా అన్నారు.
వెంటనే అలీ పర్స్ లో నుంచి డబ్బు తీయబోతుంటే, బ్రహ్మానందం తన చేతికి ఉన్న గోల్డ్ రింగ్ తీశారు. ఆ రింగ్ ను రిక్కీకి ఇచ్చాారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని గురించి
శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ. ఈ సినిమాను ఫస్ట్ డైరెక్ట్ గా ఓటీటీలోకి తీసుకొద్దామని అనుకున్నారు. డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో థియేటర్లలోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా మార్చి 6, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శివాజీ, లయ, బ్రహ్మానందం, అలీ, బండ్ల గణేష్ తదతరులు హాజరయ్యారు.