Teja Sajja Revanth Reddy: తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన స్టార్

Teja Sajja Revanth Reddy: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.

Published on: Nov 6, 2026, 21:43:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Teja Sajja Revanth Reddy: సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యువ కథానాయకుడు తేజ సజ్జా త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వివాహానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, తాజాగా ఆ వార్త నిజమేనని స్పష్టమైంది.

Teja Sajja Revanth Reddy: తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన స్టార్
Teja Sajja Revanth Reddy: తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన స్టార్

తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తేజ సజ్జా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆహ్వానం

హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తేజ సజ్జా, ఆయనకు బొకే అందించి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన నిశ్చితార్థ వేడుక ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకకు తప్పక హాజరుకావాలని కోరారు.

యంగ్ హీరోను ఎంతో ఆప్యాయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన నిశ్చితార్థానికి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పాన్ ఇండియా రేంజ్ వరకు..

తేజ సజ్జా టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఇంద్ర', 'చూడాలని ఉంది' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో బాలనటుడిగా తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నారు.

కథానాయకుడిగా మారిన తర్వాత విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబి రెడ్డి ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించి మెప్పించారు.

సంక్రాంతి కానుకగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.

తేజ సజ్జా నిశ్చితార్థం, రాబోయే సినిమాలు

తేజ సజ్జా నిశ్చితార్థం అత్యంత ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లో వైభవంగా జరగనుందని సమాచారం. నిశ్చితార్థం అనంతరం వివాహ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తనది పెద్దలు కుదిర్చిన సంబంధం అని గతంలోనే తేజ వెల్లడించారు. అమ్మాయికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే అమ్మాయి ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు.

ఇక చివరిగా మిరాయ్ లో కనిపించిన తేజ సజ్జా.. ఈ మధ్యే ప్రైమ్ వీడియోలో వచ్చిన ది ట్రైటర్స్ తెలుగు రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జాంబి రెడ్డి 2తో రాబోతున్నాడు. ఈ సినిమా విజువల్స్ నెక్ట్స్ లెవెల్ అని ఈ మధ్యే అతడు వెల్లడించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More