Bhagyashri Borse: మా నాన్న ఉద్యోగం కోసం వేడుకున్నాడు.. ఎన్నో దారుణమైన రోజులు చూశా: భాగ్యశ్రీ స్టార్‌డమ్ వెనుక కన్నీళ్లు

Bhagyashri Borse: టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన దారుణమైన గతం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టించింది. తన చిన్నతనంలో తాను, తన కుటుంబం పడిన కష్టాల గురించి చెప్పింది.

Published on: Jul 13, 2026, 11:09:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhagyashri Borse: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్, ఈ మధ్యే లెనిన్ తో మరో సక్సెస్ అందుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. గ్లామర్ ఫీల్డ్‌లో స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పి కన్నీళ్లు తెప్పించింది. పక్కా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఇంతటి సక్సెస్ సాధించడం వెనుక ఉన్న బాధ గురించి సోషల్ మీడియా వేదికగా ఓపెన్ అయింది.

Bhagyashri Borse: మా నాన్న ఉద్యోగం కోసం వేడుకున్నాడు.. ఎన్నో దారుణమైన రోజులు చూశా: భాగ్యశ్రీ స్టార్‌డమ్ వెనుక కన్నీళ్లు
Bhagyashri Borse: మా నాన్న ఉద్యోగం కోసం వేడుకున్నాడు.. ఎన్నో దారుణమైన రోజులు చూశా: భాగ్యశ్రీ స్టార్‌డమ్ వెనుక కన్నీళ్లు

చాలా కష్టాలు పడ్డాం

సినిమాల్లో హీరోయిన్ల లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అక్కడికి చేరుకోవడానికి వాళ్లు పడే కష్టం అంతాఇంతా కాదు. భాగ్యశ్రీ బోర్సే కూడా అలాంటి ఎన్నో కష్టాలు అనుభవించి వచ్చినట్లు తాజాగా ఆమె కామెంట్స్ ను బట్టి తెలుస్తోంది. ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన హార్ట్ టచింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

"నేను చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా నాన్నకు ఇద్దరం ఆడపిల్లలమే. నేను పుట్టగానే మా నాన్న ఉద్యోగం పోయింది. మరో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు.. ఉద్యోగం ఇవ్వండని వేడుకునే వాడు. మా జీవితాల్లో ఎన్ని కష్టాలు రావాలో అన్నీ చూశాం. అప్పుడే నేను డిసైడయ్యాను.. ఏదో ఒక రోజు నేను కూడా బాగా సంపాదించాలి.. మా నాన్న కష్టాన్ని తీర్చాలి అనుకున్నాను" అని ఈ బ్యూటీ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది.

ఓవర్ నైట్ స్టార్‌డమ్.. వరుస ఆఫర్స్

హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీతో తెలుగు ఆడియన్స్‌కు గ్రాండ్‌గా పరిచయం అయింది భాగ్యశ్రీ. ఆ సినిమాలో రవితేజ పక్కన ఆమె వేసిన మాస్ స్టెప్పులు, చూపించిన గ్లామర్ కుర్రకారుకు పిచ్చెక్కించాయి. ఫస్ట్ సినిమాతోనే యూత్‌లో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకుంది. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఏమాత్రం తడబడకుండా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

కేవలం గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని తన డెబ్యూ మూవీతోనే ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత కింగ్డమ్, కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా, తాజాగా లెనిన్ సినిమాలు చేసింది. ఇప్పుడు లెనిన్ మూవీతోనూ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లోనూ ఆమె కంటతడి పెట్టింది. హైదరాబాద్ తన కర్మభూమి అని, తన చివరి మూవీ ఇక్కడే చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

స్క్రీన్ పై తన గ్లామర్, నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఓ హీరోయిన్.. తన గతం గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడటం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె మాట్లాడిన ఈ వీడియో వైరల్ అయిన తర్వాత భాగ్యశ్రీపై ఉన్న గౌరవం మరింత పెరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More