...
...
Next Story

Rakul Preet Singh: సినిమాల పేరుతో విదేశాలకు కోట్లు తరలింపు.. రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త, మామ ఇళ్లు, ఆఫీసులపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడుల వార్త కలకలం రేపుతోంది. భారీగా ట్యాక్స్ ఎగ్గొట్టడం, విదేశాలకు నిధులు తరిలించారన్న ఆరోపణలు వాళ్ల ఫ్యామిలీ ఎదుర్కొంటోంది.

Published on: Sep 28, 2026, 14:44:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rakul Preet Singh: సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ముంబైలో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు భారీ సోదాలు చేపట్టారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, ఆమె మామ, ప్రముఖ నిర్మాత వషూ భగ్నానీ, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ పాన్ నొరామా స్టూడియోస్ ఆఫీసులపై ఒకేసారి దాడులు జరిగాయి. పన్ను ఎగవేత, విదేశాలకు భారీగా ఫండ్స్ తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఐటీ దాడి బాలీవుడ్‌లో పెద్ద కలకలం రేపింది.

12 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

Rakul Preet Singh: సినిమాల పేరుతో విదేశాలకు కోట్లు తరలింపు.. రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు
Rakul Preet Singh: సినిమాల పేరుతో విదేశాలకు కోట్లు తరలింపు.. రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు

రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు ఆమె మామకు సంబంధించి ముంబై వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 ప్రాంతాల్లో ఐటీ స్పెషల్ టీమ్స్ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. సినిమాలు తీసే పేరుతో విదేశీ ఖాతాలకు కోట్లాది రూపాయల నిధులు అక్రమంగా మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

గతంలో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాల ప్రాజెక్టులు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ డీల్స్, విదేశీ షూటింగ్‌ల పేరుతో జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌పై ఐటీ టీమ్స్ ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. డిజిటల్ సాక్ష్యాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కీలకమైన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ - భగ్నానీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్

రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ నుంచి నార్త్ వరకు ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకుంది. 2024 ఆరంభంలోనే ఈ భామ ప్రముఖ నిర్మాత వషూ భగ్నానీ కుమారుడు, యంగ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది.

వషూ భగ్నానీకి చెందిన పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఆ మధ్య అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లతో కలసి 'బడే మియాన్ చోటే మియాన్' అనే భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా తీశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో పాటు క్రూ మెంబర్స్ రెమ్యునరేషన్స్ వివాదాల్లో చిక్కుకుంది.

ఈ ఐటీ దాడుల లిస్ట్‌లో బాలీవుడ్‌లోని మరో అగ్ర ప్రొడక్షన్ హౌస్ పాన్ నొరామా స్టూడియోస్ కూడా ఉండటం గమనార్హం. అజయ్ దేవగణ్‌తో కలసి బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన 'దృశ్యం' ఫ్రాంచైజీ, అలాగే 'షైతాన్' వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలను ఈ బ్యానర్ నిర్మించింది.

సినిమాల నిర్మాణం, ఓవర్సీస్ రైట్స్ పేరిట విదేశాలకు ఫండ్స్ పంపారనే బలమైన ఆధారాలు లభించడంతోనే ఈ సోదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్లను భారీగా చూపి పన్నులు ఎగవేసేందుకు ప్రయత్నించారనే కోణంలో విచారణ సాగుతోంది.

ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్.. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రామాయణం' సినిమాలో శూర్పణఖ పాత్రలో నటిస్తూ వార్తల్లో నిలిచింది. సరిగ్గా బిజీ ప్రాజెక్టులతో కెరీర్‌లో ముందుకెళ్తున్న టైమ్‌లోనే ఈ లీగల్ కష్టాలు ఎదురవడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఐటీ అధికారుల నుంచి త్వరలోనే ఈ సోదాలకు సంబంధించిన అధికారిక ప్రెస్ నోట్ వెలువడే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉండటంతో సినీ వర్గాలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks