జైలు ఊచల వెనుక ఘుమఘుమలాడే మండి.. జిస్మత్ మండి మరో బ్రాంచ్ ఓపెన్ చేసిన హీరో ధర్మ మహేష్!
సినీ హీరో, జిస్మత్ మండి అధినేత ధర్మ మహేష్ మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేశాడు. జిస్మత్ మంమడి రెండవ బ్రాంచ్‌ను చైతన్యపురిలో ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా హీరో ధర్మ మహేష్ వెల్లడించారు.
తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ధర్మ మహేష్. ఇదివరకు డ్రింకర్ సాయి సినిమాతో హీరోగా మెప్పించారు ధర్మ మహేష్. హీరోగానే కాకుండా వ్యాపారంలో కూడా రాణించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఈ యంగ్ హీరో.

నాణ్యతతో నోరూరించే వంటకాలు
జిస్మత్ మండి అధినేత అయిన ధర్మ మహేష్ చైతన్యపురిలో తమ రెండవ బ్రాంచ్‌ను ప్రారంభించారు. భోజనప్రియులకు నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
కుమారుడిపై ప్రేమతో
ఈ సందర్భంగా సినీ హీరో ధర్మ మహేష్ మాట్లాడుతూ తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ (Gismat) మండిని జిస్మత్ (Jismat) మండీగా మారుస్తూ అతిథి రంగంలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
భావోద్వేగం, వారసత్వం
ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismatకు మార్చాము. ఇది నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని ధర్మ మహేష్ అన్నారు. భావోద్వేగపరంగా ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుందన్నారు. ధర్మ మహేష్ కంపెనీ మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేశారు.
బ్రాండ్‌ను బలోపేతం చేస్తుంది
"రెస్టారెంట్‌కు సంబంధించిన ఇతర కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తునాము. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయి. మేము అందించే రుచి, నాణ్యత, ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ను బలోపేతం చేస్తుందని అని విశ్వసిస్తునాము" అని ధర్మ మహేష్ పేర్కొన్నారు.
సింధూరంతో హీరోగా
కాగా, సింధూరం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధర్మ మహేష్ ఇటీవల డ్రింకర్ సాయితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే, ఇదివరకు కూకట్‌పల్లిలో జిస్మత్ పేరుతో జైలు మండి కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు ధర్మ మహేష్. ఇప్పుడు మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేశారు.
రెస్టారెంట్ విశేషాలు
కాగా ‘జిస్మత్ జైలు మండి’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జైలు థీమ్‌తో విభిన్నమైన అనుభూతినిచ్చే ఈ రెస్టారెంట్ అనేక విశేషాలతో నిండి ఉంది.
‘జైలు’ థీమ్‌తో సరికొత్త ప్రయోగం సాధారణంగా రెస్టారెంట్లకు వెళ్తే మంచి ఇంటీరియర్, లైటింగ్ చూస్తాం. కానీ జిస్మత్ మండిలో అడుగుపెట్టగానే.. మనం ఏదో జైలుకు వెళ్లినట్లు అనిపిస్తుంది. కస్టమర్లు కూర్చునే ప్రదేశాలను జైలు గదుల తరహాలో, ఇనుప ఊచలతో డిజైన్ చేయడం ఇక్కడి ప్రత్యేకత.
ఖైదీల వేషధారణలో
అంతేకాదు, ఇక్కడ పనిచేసే వెయిటర్లు ఖైదీల వేషధారణలో వచ్చి ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేసేటప్పుడు సంకెళ్లు (Handcuffs) వంటి వస్తువులను అలంకరణలో భాగంగా వాడటం సందర్శకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.
సెల్ఫీలు దిగడానికి, స్నేహితులతో సరదాగా గడపడానికి ఈ వాతావరణం భలేగా సెట్ అవుతుందని కస్టమర్లు అంటున్నారు. ఇలా హీరోగా రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ ధర్మ మహేష్ తనదైన ముద్ర వేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












