Naga Vamsi Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న విపరీతమైన క్రేజ్ మరోసారి రుజువైంది. బ్లాక్‌బస్టర్ హిట్ 'జైలర్' సీక్వెల్‌గా వస్తున్న 'జైలర్ 2' ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో మైండ్ బ్లాకింగ్ సంచలనం సృష్టిస్తోంది.
రూ. 45 కోట్లతో నాగవంశీ భారీ స్కెచ్

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఏకంగా రూ. 45 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ సినిమాలను పంపిణీ చేయడంలో నాగవంశీ మార్కెట్ వ్యూహం వేరుగా ఉంటుంది. రజనీకాంత్ మాస్ హవాపై పూర్తి నమ్మకంతోనే ఆయన ఈ స్థాయిలో భారీ రేటు చెల్లించి డీల్ క్లోజ్ చేశారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ బిజినెస్ కూడా మునుపెన్నడూ లేని రీతిలో రికార్డులు తిరగరాస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను (ఉత్తర అమెరికా, యూకే, యూరప్, ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్) సుమారు రూ. 47.5 కోట్లకు దక్కించుకుంది.
దీంతో ఒక్క తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్ కలిపి ఏకంగా రూ. 90 కోట్లకు పైగానే దాటేసింది. ఒక్క నార్త్ అమెరికా మార్కెట్ హక్కులే రూ. 28 కోట్లకు అమ్ముడుపోగా, అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 7 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది.
నెల్సన్ దిలీప్‌కుమార్ మార్క్ మాస్ ఎంటర్‌టైనర్
డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల తుఫాన్ సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల తుఫాన్ సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
{{/usCountry}}మొదటి భాగం గ్లోబల్ వైడ్‌గా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, ఈ పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చే ఎలివేషన్ మ్యూజిక్, రజనీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ కానున్నాయి.
బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ క్లాష్.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’
అయితే ఈ దసరా పోటీ అంత తేలిగ్గా ఉండేలా కనిపించడం లేదు. జైలర్ 2 రిలీజ్ అయిన మరుసటి రోజే, అంటే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న 'రణబాలి' సినిమా థియేటర్లలోకి వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై కూడా టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా రవితేజతో 'ఇరుముడి' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టిన మైత్రీ మేకర్స్.. రణబాలి సినిమాను కూడా అంతే గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం AK47' అక్టోబర్ 9నే బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా భారీ పోటీని ఇవ్వనుంది. మొత్తం మీద అక్టోబర్ 2026 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.